Bigg Boss 10 Telugu:టాప్ ఓటింగ్ తో త్రిగుణ్, ముఖేష్..డేంజర్ జోన్లో వంశీ, రామకృష్ణ!
Nov 25, 2026 8:52AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో 12వ వారం ఓటింగ్ రసవత్తరంగా మారింది. ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు ఉండగా.. ఇప్పటివరకు వచ్చిన లైవ్ ఓటింగ్ పోల్‌లో త్రిగుణ్ దూసుకుపోతున్నాడు. త్రిగుణ్‌కు 24.05% ఓట్లతో 26,169 ఓట్లు పడ్డాయి. అతని వెనకే ముఖేష్ 22.48% ఓట్లతో 24,467 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఇద్దరి మధ్య తేడా కేవలం 1.57% మాత్రమే. ఫినాలే రేసులో ఈ ఇద్దరూ టాప్ కంటెండర్లుగా నిలుస్తున్నారని ఈ ఓటింగ్ మరోసారి చెప్పేసింది.
మూడో స్థానంలో రామ్ ప్రసాద్ 13.49% ఓట్లతో 14,683 ఓట్లతో సేఫ్ జోన్లో ఉన్నాడు. నాలుగో స్థానంలో దేబ్జానీ 12.58% ఓట్లతో 13,689 ఓట్లు సాధించింది. ఐదో స్థానంలో వర్షిణి 11.16% ఓట్లతో 12,146 ఓట్లతో ఉంది. వీళ్లు ముగ్గురూ ప్రస్తుతానికి సేఫ్‌గా కనిపిస్తున్నా.. ఓటింగ్ ముగియడానికి ఇంకా 2 రోజులు, 15 గంటల సమయం ఉండటంతో ఏ క్షణంలోనైనా లెక్కలు మారిపోవచ్చు.
అసలు టెన్షన్ అంతా బాటమ్ టూలోనే ఉంది. ఆరో స్థానంలో వంశీ 8.31% ఓట్లతో 9,043 ఓట్లు, ఏడో స్థానంలో రామకృష్ణ 7.93% ఓట్లతో 8,633 ఓట్లతో ఉన్నారు. ఇద్దరి మధ్య తేడా కేవలం 410 ఓట్లు మాత్రమే. వంశీకి డైరెక్ట్ నామినేషన్ పడటం, రామకృష్ణకు పెద్దగా స్క్రీన్ టైమ్ లేకపోవడం ఇద్దరికీ మైనస్‌గా మారింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్లిద్దరూ డేంజర్లో ఉన్నట్లే. సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం రామకృష్ణకే ఎక్కువ ముప్పు ఉందని పోల్ చెప్తోంది.మొత్తానికి 12వ వారం ఓటింగ్‌లో త్రిగుణ్, ముకేష్ టాప్‌లో దూసుకెళ్తుండగా.. వంశీ, రామకృష్ణ బాటమ్‌లో కొట్టుమిట్టాడుతున్నారు. వర్షిణి, దేబ్జానీ, రామ్ ప్రసాద్ మధ్యలో ఊగిసలాడుతున్నారు. ఓటింగ్ ముగిసేలోపు ఫ్యాన్స్ ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తారో అన్నదానిపైనే ఎలిమినేషన్ ఆధారపడి ఉంది. మరి ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లేది వంశీనా? రామకృష్ణనా? అనేది తెలియాలంటే వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే.




