TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

BiggBoss 10 Telugu: హౌస్ లోకి రీతూ, డీమాన్ పవన్ ఎంట్రీ.. హై వోల్టేజ్ డ్రామా!

Nov 25, 2026 8:58AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకుంది. ఈ సీజన్ లో నీతూ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ లో 12వ వారం బడ్డీ అప్ థీమ్ తో స్టార్ట్ అయింది. ఈ థీమ్ లో భాగంగా మాజీ సీజన్ల కంటెస్టెంట్లు హౌస్ లోకి బడ్డీలుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఇమ్మాన్యుయేల్, సంజన, దివ్య, కళ్యాణ్ పడాల హౌస్ లోకి వచ్చి కెప్టెన్సీ టాస్కులు ఆడించారు. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి అత్యంత పాపులర్ జంట రీతూ చౌదరి మరియు డీమాన్ పవన్ బడ్డీ అప్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం.

బడ్డీ అప్ థీమ్ అంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లను జంటలుగా విడగొట్టి టాస్కులు ఇవ్వడం. రీతూ, డీమాన్ వచ్చి హౌస్ మేట్స్ తో కలిసి గేమ్స్ ఆడతారు. గత సీజన్లలో రీతూ తన స్ట్రాంగ్ గేమ్ తో, డెమోన్ పవన్ తన ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను అలరించారు. వీరిద్దరూ కలిసి వస్తే హౌస్ లో గొడవలు, ఫన్ మామూలుగా ఉండవు. ముఖ్యంగా రీతూ గ్లామర్ మరియు డీమాన్ కామెడీ టైమింగ్ తో హౌస్ మొత్తం సందడి సందడిగా మారనుంది. ఈ వారం బడ్డీ అప్ టాస్కుల్లో గెలిచిన వారికి నేరుగా కెప్టెన్సీ కంటెండర్ అవకాశం ఇస్తున్నారు. ఇప్పటికే త్రిగుణ్, ఆర్కే, శివ్, దేబ్జానీ, రామ్ ప్రసాద్, ముఖేష్ కెప్టెన్సీ రేసులోకి వచ్చారు. రీతూ, డీమాన్ ఎంట్రీ తర్వాత మరిన్ని టఫ్ టాస్కులు ఉండబోతున్నాయి. హౌస్ లో ఇప్పటికే ముఖేష్ వర్సెస్ త్రిగుణ్ వార్ నడుస్తుండగా, బయటి నుంచి వచ్చిన బడ్డీలు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది ఆసక్తిగా మారింది.

మొత్తంగా బిగ్ బాస్ సీజన్-10 గ్రాండ్ ఫినాలేకు మరో 4 వారాలే ఉండటంతో బిగ్ బాస్ టీమ్ హౌస్ లోకి వరుసగా మాజీ కంటెస్టెంట్లను తీసుకొస్తున్నారు. రీతూ, డీమాన్, అవినాష్, సిరి హనుమంత్, శోభాశెట్టి లాంటి వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. రీతూ డీమాన్ జోడీ ఎంట్రీతో 12వ వారం మరింత రసవత్తరంగా మారడం ఖాయం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

google-ad-img