Bigg Boss 10 Telugu: వైల్డ్ కార్డ్ గా వచ్చి దుమ్మురేపుతున్న ఆర్కే!
Nov 25, 2026 9:04AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చిన రామకృష్ణ అలియాస్ ఆర్కే.. ఇప్పుడు హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారాడు. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన చాలామంది కంటెస్టెంట్లు నీతూ మాస్టర్ సహా ఎలిమినేట్ అయి వెళ్లిపోయినా, RK మాత్రం ఇప్పటికీ హౌస్ లో స్ట్రాంగ్ గా కొనసాగుతున్నాడు. Day 1 నుండి ఉన్న కంటెస్టెంట్లకు కూడా గట్టి పోటీ ఇస్తూ తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
హౌస్ లో RK తీరు చాలా డిఫరెంట్ గా ఉంది. ఎవరితోనూ అనవసర గొడవలకు వెళ్లకుండా, తన గేమ్ తాను ఆడుతూ సైలెంట్ గా స్ట్రాటజీలను ప్లాన్ చేస్తున్నాడు. బడ్డీ అప్ వారంలో కూడా త్రిగుణ్ తో కలిసి టాస్కులో గెలిచి కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచాడు. తొలిసారి గెలిచానంటూ అతను చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్ అయింది. నామినేషన్లలో కూడా త్రిగుణ్, సుధీర్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్లను నామినేట్ చేస్తూ ధైర్యంగా ముందుకు వెళ్తున్నాడు.
వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అంటే కొన్ని వారాల్లోనే వెళ్లిపోతారని అందరూ అనుకుంటారు. కానీ RK దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేశాడు. హౌస్ లో అమన్, దేబ్జానీ, ముకేష్, త్రిగుణ్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్లు ఉన్నప్పటికీ, వారి మధ్య తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు చాలా కూల్ గా, లాజికల్ గా మాట్లాడుతూ నాగార్జున ప్రశంసలు కూడా అందుకుంటున్నాడు. ప్రస్తుతం 12వ వారానికి చేరుకున్న బిగ్ బాస్ 10 లో RK టాప్ 5 రేసులోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. వైల్డ్ కార్డ్ గా వచ్చి, Day 1 కంటెస్టెంట్లను దాటి ఫినాలే వరకు వెళ్తాడేమో అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




