Ashwinii Sree: ఎక్కడికి వెళ్లినా జంతువులకు ఆహారం పెట్టడమే నా రిచ్యువల్: అశ్వినిశ్రీ!
Nov 25, 2026 9:07AM

బిగ్ బాస్ తెలుగు ఫేమ్, సోషల్ మీడియా సెన్సేషన్ అశ్వినిశ్రీ మరోసారి తన మంచి మనసును చాటుకుంది. ఎక్కడికి వెళ్లినా జంతువులకు ఆహారం పెట్టడం తన అలవాటు అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియోను షేర్ చేసింది. గోవాలో రోడ్డుపై ఉన్న ఆవుకు బ్రెడ్ పెడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫోటోలో అశ్వినిశ్రీ చెప్పులు లేకుండా, చేతిలో బ్రెడ్ పట్టుకొని ఆవుకు తినిపిస్తూ కనిపిస్తోంది. "Feeding animals ritual where ever i go ❤️✨" అంటూ క్యాప్షన్ పెట్టింది. గోవా వీధుల్లో అపార్ట్మెంట్ల మధ్య ఆవుకు ఆహారం పెడుతున్న ఆమె సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా అశ్విని జంతు ప్రేమ గురించి చాలాసార్లు మాట్లాడిన విషయం తెలిసిందే.
అశ్విని శ్రీ ప్రస్తుతం గోవా ట్రిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ తర్వాత వరుస ప్రాజెక్టులు, ఫోటోషూట్లతో బిజీగా ఉన్నా, ఇలాంటి సేవా కార్యక్రమాలను మాత్రం మర్చిపోవడం లేదు. గతంలో కూడా కుక్కలకు, ఆవులకు ఆహారం పెడుతున్న వీడియోలను షేర్ చేసింది. ఆమె ఈ పోస్ట్ చూడగానే ఫ్యాన్స్ "గోల్డెన్ హార్ట్" అంటూ కామెంట్లు చేస్తున్నారు.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అశ్విని శ్రీ ఇన్స్టాగ్రామ్లో @ashwinii_sree అకౌంట్ లో లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. తన ట్రావెల్, ఫ్యాషన్ తో పాటు ఇలాంటి మంచి పనులను కూడా షేర్ చేయడం వల్ల ఆమెకు ఫ్యాన్ బేస్ రోజురోజుకీ పెరుగుతోంది.




.webp)