Home

»

Exclusive Movie News

తెలుగు సినిమాలో డ్రెస్సింగ్ మార్పులు.. మీ ఫేవరెట్ స్టార్స్ ఎలా మారారో తెలుసా?

Sep 1, 2026 11:48AM

 

కాస్ట్యూమ్స్.. ఒక సినిమా ప్రేక్షకాదరణ పొందడానికి కథ, కథనంతో పాటు కాస్ట్యూమ్స్ కూడా చాలా ముఖ్యం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కథ,కథనంలో దాగి ఉండే ఆనందం, సంఘర్షణ తాలూకు భావోద్వేగం పండాలంటే క్యారెక్టర్స్ కి కుదిరేలా కాస్ట్యూమ్స్ ఉండాల్సిందే. అలా ఉంటేనే సినిమా ప్రేక్షకుడి హృదయ నాళంలోకి చేరుతుంది.     హీరోకి వీరాభిమానుల్ని సంపాదించి పెట్టే బాధ్యతని కూడా కాస్ట్యూమ్స్ తీసుకుంటుంది. మరి అంతలా ప్రాముఖ్యత సంతరించుకున్న కాస్ట్యూమ్స్ విషయంలో సినిమా సృష్టించుకున్న మార్పులేంటో చూద్దాం.  


గత తొమ్మిది దశాబ్దాల్లో టాలీవుడ్ డ్రెస్సింగ్ స్టైల్ ఎంతగా మారిందో చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 1930ల బ్లాక్ అండ్ వైట్ సినిమాల రోజుల్లో సాంప్రదాయ ధోతీలు, కాటన్ చీరలు ప్రధానంగా ఉండేవి. ఆ తర్వాత కథల్లో వచ్చిన మార్పుల దృష్ట్యా, 1950ల 'మాయాబజార్', 'పాతాళభైరవి' వంటి జానపద, పౌరాణిక చిత్రాల్లో భారీ పట్టువస్త్రాలు, రత్నఖచిత కిరీటాలు, నిండు ఆభరణాలతో నటీనటులు రాజసం ఉట్టిపడేలా కనిపించేవారు. ముఖ్యంగా మహానటి సావిత్రి గారు కాంచీపురం పట్టుచీరలు, మోచేతి వరకు ఉండే బ్లౌజులు, చిన్ని బొట్టుతో ప్రదర్శించిన క్లాసిక్ శైలి అయితే నేటికీ దక్షిణభారత ఫ్యాషన్‌కి బెంచ్‌మార్క్‌గా నిలిచింది. 'మహానటి' బయోపిక్‌ కోసం కీర్తి సురేష్ ఏకంగా 130 కి పైగా విభిన్న రకాల వింటేజ్ లుక్స్ ధరించి ఆనాటి వైభవాన్ని పునఃసృష్టించిందంటే కాస్ట్యూమ్స్ డామినేషన్ ని అర్ధం చేసుకోవచ్చు.  

1970లు, 80ల నాటికి టాలీవుడ్ స్టైల్ మెల్లగా రెట్రో వైపు అడుగులు వేసింది. ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి వారి హవాతో బెల్ బాటమ్ ప్యాంట్లు, పొడవాటి కాలర్లు ట్రెండ్ అయ్యాయి. ఆ తర్వాత 1990లలో మనీష్ మల్హోత్రా, నీతా లుల్లా వంటి ప్రముఖ డిజైనర్లు తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టడంతో కాస్ట్యూమ్స్ కథ పూర్తిగా మారిపోయింది.శ్రీదేవి గారి ఐకానిక్ 'క్షణక్షణం' కాస్ట్యూమ్స్, 'గీతాంజలి' చిత్రంలో గిరిజ ధరించిన డ్రెస్‌లు ఆ రోజుల్లో ప్రతీ ఇంటి అమ్మాయి వార్డ్‌రోబ్‌లో భాగమయ్యాయి. 90 ల్లో బ్యాగీ జీన్స్ అండ్ 90s హిప్ హాప్ శైలి బాగా హవా నడించింది. చిరంజీవి,  బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇందుకు ఆద్యులుగా నిలవగా, నేడు మళ్ళీ ఈ ట్రెండ్ వరల్డ్ వైడ్ గా ట్రెండింగ్ లో ఉంది.

2000వ దశకంలో పవన్ కళ్యాణ్ కార్గో ప్యాంట్లు, ఓవర్‌సైజ్డ్ హూడీలు, మహేష్ బాబు పోకిరి షర్టులు,ఎన్టీఆర్ యమదొంగ షర్ట్స్ తో పాటు ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ డ్రెస్సింగ్  స్టైల్, బ్లూ జీన్స్ కుర్తా లుక్స్ యువతని పిచ్చెక్కించాయి  'బొమ్మరిల్లు', కొత్త బంగారు లోకం మిడ్డిలు, వర్షం హాఫ్ శారీస్ ప్రతీ కాలేజ్ అమ్మాయికి  ఫేవరెట్‌గా మారాయి. నేటి 2026 నాటి మోడరన్ సినిమాలో ఫ్యాషన్ మరింత గ్లోబల్‌గా మారిపోయింది. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'కల్కి 2898 AD' వంటి పాన్ ఇండియా, సైన్స్ ఫిక్షన్ చిత్రాల విజయంలో కాస్ట్యూమ్ డిజైనర్ల పాత్ర 100 శాతం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతర్జాతీయ బ్రాండ్లు, సస్టైనబుల్ వింటేజ్ ఫ్యాషన్, ఫ్యూజన్ కల్చర్ ఇప్పుడు రాజ్యమేలుతున్నాయి. ముందు ముందు మరిన్ని ఫ్యాషన్స్ రాజ్యమేలుతాయి కూడా. చివరిగా చెప్పుకోవాలంటే కాస్ట్యూమ్స్ సినిమాకి హార్ట్ కోర్(Heart Core ) లాంటివి. అందుకే హీరోలకి హార్డ్‌కోర్ (Hardcore ) ఫ్యాన్స్ ఉంటారు.

 

 

Costume, Telugucinema, Dressing Style, Ntr, Anr, Pawan Kalyan, Mahesh Babu, Allu Arjun, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood

 

 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com