
తెలుగు సినిమా రంగంలో తనదైన స్లాంగ్, పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు కృష్ణ భగవాన్. ఆయన కెరీర్‌లో హిలేరియస్ కామెడీ ట్రాక్స్‌లో 'బురిడీ' సినిమాలోని సీన్లు ఎప్పటికీ ప్రత్యేకం. ఈ చిత్రంలో కృష్ణ భగవాన్, ఎంఎస్ నారాయణ, రఘుబాబుల కాంబినేషన్‌లో వచ్చే ప్రతీ సీన్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కృష్ణ భగవాన్ మార్క్ మందుబాబు కామెడీ, తల్లితో ఆస్తి కోసం చేసే డిస్కషన్లు థియేటర్లలో నవ్వుల పూలు పూయించాయి.
ఈ సినిమాలో కృష్ణ భగవాన్ నిత్యం మందులో మునిగితేలే పాత్రలో కనిపిస్తారు. ఆయన తాగి పడేసిన ఖాళీ సీసాలు అమ్ముకుని చుట్టుపక్కల వాళ్ళు లక్షలు సంపాదించి లైఫ్‌లో సెటిల్ అయిపోయారనే రేంజ్ లో తాగడం ఆయన స్పెషాలిటీ. తల్లి వచ్చి మందు మానమని బ్రతిమిలాడితే.. రాష్ట్రంలో బందులు జరిగి బార్లు బందయినప్పుడు, గాంధీ జయంతినాడు మందు కొట్లు మూసేసినప్పుడు, ఎలక్షన్ కౌంటింగ్ రోజు మాత్రమే మందు మానుతానని తనదైన స్టైల్లో కౌంటర్ ఇస్తాడు. చనిపోయిన భార్యను మర్చిపోలేక తాగుతున్నానని సెంటిమెంట్ డైలాగ్స్ కొడతాడు.
అయితే ఇక్కడే ట్విస్ట్ ఇస్తుంది తల్లి. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోకపోతే ఆస్తంతా సీఎం రిలీఫ్ ఫండ్‌కు రాసేస్తానని ఒక వారం టైం ఇస్తుంది. దీంతో మందు కావాలంటే ఆస్తి కావాలి, ఆస్తి కావాలంటే పెళ్లి కావాలనే కండిషన్‌కు ఒప్పుకోక తప్పని పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలోనే 10 లక్షల రూపాయల భారీ ఫ్యాన్సీ ఆఫర్‌తో ఒక అమ్మాయిని విడాకులు ఇచ్చే కండిషన్‌తో పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తారు. 10 లక్షల కట్నం వస్తుందనగానే ఇంట్లో కష్టాలన్నీ తీరిపోతాయని ఆ అమ్మాయి కుటుంబం కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.
పెళ్లి కాగానే ఆస్తి పత్రాలు చేతికి వస్తాయనుకుంటే, తల్లి మరో షాక్ ఇస్తూ బ్యాంకాక్‌కు హనీమూన్ టికెట్లు ఇస్తుంది. ఒక వారం పాటు బ్యాంకాక్ వెళ్లి తిరిగి వచ్చాక, సంసార సుఖానికి ఒంట్లో కరెంటు లేదని కోర్టులో చెప్పి విడాకులు తీసుకోవచ్చని ఆ అమ్మాయి ప్లాన్ చేస్తుంది. ఈ హనీమూన్ ట్రిప్‌లో బ్యాంకాక్ హోటల్‌లో కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఉచితంగా వచ్చే మందు, చిలకొట్టిన జామపండు చాలా టేస్టీగా ఉంటాయంటూ శివారెడ్డి చెప్పే డైలాగులు పేలతాయి.
మరోవైపు హోటల్లో లేడీస్ అందరినీ పోగుచేసి, మీ మొగుళ్లు మిమ్మల్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంటూ ఎంఎస్ నారాయణ చెప్పే ఇంటెలిజెన్స్ రిపోర్ట్, "పతియే ప్రత్యక్ష మరణం" అంటూ చేసే కామెడీ స్పీచ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. మొత్తానికి ఈ బురిడీ సినిమా కామెడీ ట్రాక్ తెలుగు ప్రేక్షకులకు ఎవర్ గ్రీన్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది.
Buridi Movie, Krishna Bhagvaan Comedy, Telugu Comedy, EVV Satyanarayana, TeluguOne





