Home

»

Latest News

zombie reddy 2: జాంబీరెడ్డి 2 అప్ డేట్ వైరల్.. తేజ సజ్జతో జోడి కడుతున్న బాలీవుడ్ అగ్ర హీరో కూతురు! 

Jul 1, 2026 11:52AM

 

 

యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja)ఇప్పుడు కేవలం టాలీవుడ్ హీరో మాత్రమే కాదు, పాన్ ఇండియా హీరో.. పాన్ ఇండియా లెవల్లో హనుమాన్, మిరాయ్ సాధించిన విజయాలే ఒక ఉదాహరణ.  ఈ కోవలోనే తన కెరీర్‌లో ఫస్ట్ సోలో హిట్ గా నిలిచిన 'జాంబీ రెడ్డి' చిత్రానికి సీక్వెల్‌గా 'జాంబీ రెడ్డి 2'(zombie reddy 2)తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

ఈ క్రేజీ సీక్వెల్‌కి సంబంధించిన ఒక సంచలన అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె, గ్లామర్ బ్యూటీ షనయా కపూర్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే షూటింగ్  ప్రారంభం కాగా, తేజ సజ్జ, షనయా కపూర్‌లపై కొన్ని కీలకమైన యాక్షన్, డ్రామా సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ గ్లామర్ టాలీవుడ్ జానపద మరియు రాయలసీమ బ్యాక్‌డ్రాప్ జాంబీ థ్రిల్లర్‌కి  తోడైతే స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.  విలక్షణ నటుడు ఎస్‌జే సూర్య ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండటం విశేషం.

Also read: Nbk 111: మాస్ కా బాప్ ఈజ్ బ్యాక్.. గర్జించనున్న నందమూరి సింహం!

ఈసారి ఈ ప్రాజెక్ట్‌లో మరో ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్‌కు కేవలం కథను మాత్రమే అందిస్తున్నారు. ఈ వైల్డ్, డెడ్లీ జాంబీ యూనివర్స్‌ను భారీ స్క్రీన్‌పై ఆవిష్కరించేందుకు ప్రముఖ బాలీవుడ్ మరియు హిందీ ఓటీటీ దర్శకుడు సుపర్ణ్ వర్మ మెగాఫోన్ పడుతున్నారు. మొదటి భాగంలో రాయలసీమ ఫ్యాక్షన్ డ్రామాకు జాంబీ కాన్సెప్ట్‌ను జోడించి 100 శాతం ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించగా, ఈసారి సీక్వెల్‌లో సన్నివేశాలు మరింత క్రూరంగా, హారర్ ఎలిమెంట్స్ 2 రెట్లు ఎక్కువగా ఉండేలా కథని  సిద్ధం చేశారు. తేజ సజ్జ ప్రస్తుతం 'మిరాయ్ 2' మరియు 'జాంబీ రెడ్డి 2' చిత్రాల షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. ఈ రెండు భారీ సీక్వెల్స్ 2027 ప్రథమార్ధంలో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్  హంగులతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com