Home

»

Latest News

తెలుగు సినిమాలో హీరోయిన్ గా టీం ఇండియా స్టార్ స్పిన్నర్ మాజీ వైఫ్!

Nov 14, 2026 2:41PM

సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటే ఎవరకి చేదు చెప్పండి. సక్సెస్ అయితే సినిమా, హీరోయిన్ కట్ అవుట్ ఇచ్చే వెలలేని పేరు ప్రఖ్యాతలు అంత ప్రత్యేకం మరి. అందుకే టీం ఇండియా స్పిన్నర్ వైఫ్ జై తెలుగు సినిమా అంటూ తెలుగు సెల్యులాయిడ్ పై అడుగుపెట్టనుంది.


భారతీయ క్రికెట్ రంగంలో తనదైన స్పిన్ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న టీమిండియా స్టార్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ. సోషల్ మీడియాలో తన అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్‌తో పాపులర్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్, డెంటిస్ట్ అయిన ధనశ్రీ వర్మ త్వరలో టాలీవుడ్ చిత్రసీమలోకి అడుగుపెట్టనున్నారు.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ డ్యాన్స్ మ్యూజికల్ చిత్రం 'ఆకాశం దాటి వస్తావా' ద్వారా ఆమె నటిగా తన తొలి అడుగులు వేస్తున్నారు.

 డిసెంబర్ 22, 2020న చాహల్ ని  వివాహం చేసుకున్న ధనశ్రీ, మార్చి 2025 నాటికి చట్టబద్ధంగా విడాకులు తీసుకుని వేరుపడ్డారు. ఈ కఠినమైన భావోద్వేగ పరిస్థితుల నుంచి కోలుకుంటూ, తన వృత్తిగత జీవితంలో సరికొత్త మైలురాయిని అందుకునేందుకు ఆమె ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నారు. కేవలం మ్యూజిక్ వీడియోలకు మాత్రమే పరిమితం కాకుండా, ఒక పూర్తి స్థాయి తెలుగు చిత్రంలో నటిస్తూ వెండితెరకు పరిచయం కానుండటం ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఇది కూడా చదవండి: భార్యపై మంచు మనోజ్ ప్రశంసలు: ఐదేళ్ల కష్టానికి ప్రతిఫలం!
 

శ్రీ శశికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ సౌత్ కొరియోగ్రాఫర్ యశ్ మాస్టర్ హీరోగా , మలయాళ నటి కార్తీక మురళిధరన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఒక ప్రొఫెషనల్ డ్యాన్సర్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ధనశ్రీకి, డ్యాన్స్ ప్రధానాంశంగా సాగే ఈ కథలో నటించడం చాలా సులభమైందని, అదే సమయంలో తెలుగు భాషను నేర్చుకోవడం తనకి  ఎంతో సవాల్‌తో కూడుకున్న అనుభవమని ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ముంబైలో కీలక సన్నివేశాల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో వ్యక్తిగత వార్తలతో నిత్యం ట్రెండింగ్‌లో నిలిచిన ధనశ్రీ, ఇప్పుడు తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులని  ఏ విధంగా అలరిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చవచ్చు:మీనాక్షిచౌదరికి కీటకాలతో భోజనం పెట్టారు!
మీకు నచ్చవచ్చు:మంచు మనోజ్ కి కష్టానికి తగ్గ ప్రతిఫలం తగ్గింది!

 

 

[Dhanashree Verma, Yuzvendra Chahal, Akasham Dati Vastava, Dil Raju, Tollywood]


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com