
స్టార్ హీరో.. బాక్స్ ఆఫీస్ వద్ద,అభిమానుల హార్ట్స్ వద్ద ఆ కట్ అవుట్ కి ఉన్న క్రేజ్ గురించి చెప్పుకోవాలంటే రోజులు చాలవు. అంతలా తనదైన ఛరిష్మాతో వన్ మాన్ ఆర్మీగా సినీ స్థావరాన్ని ఏలుతున్నాడు. కోట్ల రూపాయల కలెక్షన్స్ కూడా కొల్లకొడుతూ హీరో కట్ అవుట్ అంటే ఇది అని చాటుతున్నాడు. అదంతా క్రేజ్ వల్లనే సాధ్యమవుతుంది. మరి అసలు సినిమా ప్రపంచంలో హీరో క్రేజ్ అంటే ఏమిటి? కేవలం ఒక హిట్ సినిమా ఇచ్చినంత మాత్రాన ఆ క్రేజ్ వచ్చేస్తుందా? లేక దశాబ్దాల కాలంగా అభిమానుల గుండెల్లో సంపాదించుకున్న నమ్మకానికి ప్రతీకనా?
నిజమైన హీరో క్రేజ్ అంటే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయినప్పుడు వచ్చే అభినందనలు, కలెక్షన్లు మాత్రమే కాదు, సినిమా కథ డిజాస్టర్ అని తెలిసినా, టాక్ తేడాగా వచ్చినా తొలి రోజు థియేటర్లను ప్రేక్షకులతో నింపగలిగే సత్తా! సాధారణంగా ఒక సాధారణ సినిమాకి థియేటర్లలో వసూళ్లు రావాలంటే దానికి పాజిటివ్ టాక్, మాౌత్ పబ్లిసిటీ క్రిటిక్స్ ఇచ్చే రివ్యూలు చాలా ముఖ్యం. అవన్నీ బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్ వైపు అడుగులు వేస్తారు. కానీ ఒక స్టార్ హీరో సినిమా విషయంలో ఈ లెక్కలు పూర్తిగా మారిపోతాయి. టాక్ ఎలా ఉన్నా సరే, మొదటి రోజు నుండి మొదటి వారాంతం (ఫస్ట్ వీకెండ్) వరకు కలెక్షన్ల సునామీ సృష్టించడమే ఆ హీరో అసలైన మాస్ క్రేజ్‌కు నిదర్శనం. కానీ ప్లాప్ అయినా కూడా కేవలం ఆ బడా హీరో స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ ఇమేజ్, అభిమానుల అమోఘమైన ఆదరణ కారణంగా దాదాపు 50 శాతం నుండి 70 శాతం వరకు రికవరీ సాధించడం లేదా 60 కోట్ల నుండి 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించడం మనం తరుచూ చూస్తుంటాం. ఇది కేవలం ఆ హీరో బ్రాండ్ వాల్యూ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది.
ఇది కూడా చదవండి: ప్రభాస్ క్రేజ్ కి మెయిన్ కారణం ఇదేనా!

మరి సినిమా ఫ్లాప్ అయినప్పుడు కూడా ప్రతీసారి భారీ స్థాయి వసూళ్లు ఎందుకు రావు? దీనికి సినిమా విశ్లేషకులు అనేక ముఖ్యమైన కారణాలను వెల్లడిస్తున్నారు. మొదటిది, సినిమా కంటెంట్ మరియు ప్రీ-రిలీజ్ హైప్. ఒక సినిమాపై విపరీతమైన అంచనాలు ఉండి, కంటెంట్ ఆ అంచనాలను 100 శాతం నిరాశపరిస్తే, ప్రారంభపు వసూళ్లు (ఓపెనింగ్స్) భారీగా వచ్చినా, ఆ తర్వాత రోజుల్లో వసూళ్లు ఒక్కసారిగా పడిపోతాయి (డ్రాప్ అవుతాయి). అభిమానులు తొలి రోజు థియేటర్లకు వచ్చి సినిమాని చూసినప్పటికీ, సాధారణ ప్రేక్షకులు, కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకి రావడానికి వెనుకాడతారు. ఒక సినిమా 100 కోట్ల మార్కును దాటి 200 కోట్లు లేదా 500 కోట్ల భారీ వసూళ్లను సాధించాలంటే కేవలం అభిమానుల బలమే కాకుండా 60 శాతానికి పైగా సాధారణ ప్రేక్షకుల మద్దతు తప్పనిసరిగా అవసరం. దీన్ని బట్టి అర్ధమయ్యేది ఏంటంటే సినిమా బాగుండి, స్టార్ హీరో కట్ అవుట్ తోడయ్యితే ఆ సినిమా ఊహించని కలెక్షన్స్ వసూలు చేస్తుంది. డిజాస్టర్ అయితే మోస్తరు కలెక్షన్స్.
[what is Hero Craze Box Office Analysis, hero craze analysis, box office collections, telugu cinema analysis, star hero openings, movie flop collections,Telugunews, TeluguCinema, Tollywood, Tollywood News]






