
ఈ రోజు పాన్ ఇండియా కట్ అవుట్ ప్రభాస్ పుట్టిన రోజు. ఫ్యాన్స్ కైతే ఫెస్టివల్. నార్త్ సినిమా తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన ఈ బాహుబలి గురించి నిత్యం సోషల్ మీడియా వేదికగా ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. అదేంటంటే ప్రభాస్ కి ఎందుకు ఇంత క్రేజ్ అని. మరి క్రేజ్ తాలూకు మ్యాటర్ చూద్దాం.
కేవలం సినిమాలు, బాక్సాఫీస్ కలెక్షన్లు మాత్రమే ఒక నటుడిని సూపర్ స్టార్‌ని చేయవు. అసలు ప్రభాస్‌కు భారతీయ సినిమా చరిత్రలో మరే ఇతర నటుడికీ దక్కని స్థాయిలో దాదాపు 100 శనశాతం మంది ప్రేక్షకుల నుండి అభిమానం లభించడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఆయనలోని అసాధారణమైన సింప్లిసిటీ. ఎంత పెద్ద విజయం సాధించినా, 1000 కోట్ల బాక్సాఫీస్ క్లబ్‌లో అడుగుపెట్టినా ఆయన ప్రవర్తనలో ఏమాత్రం మార్పు ఉండకపోవడం ప్రభాస్ ప్రత్యేకత. వేల కోట్ల బిజినెస్ ఆయన పేరు మీదే జరుగుతున్నప్పటికీ, మీడియా ముందుకు వచ్చినప్పుడు లేదా సెట్స్‌లో సాధారణ కార్మికులతో మాట్లాడేటప్పుడు ఆయన చూపించే నిరాడంబరత ప్రతీ ఒక్కరి హృదయాలని గెలుచుకుంటుంది. తోటి నటీనటులకు, చిత్ర బృందానికి ప్రతిరోజూ రుచికరమైన ఇంటి వంటకాలను వడ్డించే డార్లింగ్ ప్రభాస్ ఆతిథ్యం సినీ వర్గాల్లో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆత్మీయతే ఆయనను మిగతా హీరోల కంటే భిన్నంగా, అత్యంత ఆత్మీయుడిగా నిలబెట్టింది.
ప్రస్తుతం ప్రభాస్ లైనప్ చూస్తే ఏ భారతీయ నటుడికీ సాధ్యం కాని రీతిలో అద్భుతమైన ప్రాజెక్టులతో ప్రపంచవ్యాప్తంగా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల విడుదలైన 'కల్కి 2898 AD' చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారతీయ సినీ రికార్డులను తిరగరాసింది. ఈ దృశ్య కావ్యం అందించిన మైండ్ బ్లాకింగ్ విజయం తర్వాత, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'కల్కి 2' (Kalki 2) పార్ట్ ప్రొడక్షన్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. మొదటి భాగంలో భైరవగా అలరించిన ప్రభాస్, రెండవ భాగంలో పూర్తి స్థాయి కర్ణుడి అవతారంలో కనిపించి ప్రేక్షకులకు అపూర్వమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నారు.
మరోవైపు, క్లాసిక్ ఫిల్మ్ మేకర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' (Fauji - వర్కింగ్ టైటిల్) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 1940ల కాలం నాటి యుద్ధ నేపథ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఒక సైనికధికారిగా, వీరోచిత పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ప్రత్యేకంగా సరికొత్త మేకోవర్ సాధిస్తుండటం విశేషం. దానికితోడు మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న రొమాంటిక్ హారర్ ఎంటర్‌టైనర్ 'రాజా సాబ్', అలాగే సందీప్ రెడ్డి వంగా అత్యంత వైలెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్న 'స్పిరిట్' సినిమాలు కూడా ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: హాలీవుడ్ లో విషాదం: మీ అభిమాన నటుడు టామ్ స్కెరిట్ కన్నుమూత!
.webp)
ఈ భారీ ప్రాజెక్టుల విస్తృతి మరియు విభిన్న కథాంశాలు చూస్తుంటే, రాబోయే ఐదేళ్ల పాటు బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ హవా నిరంతరం కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్ని భారీ బడ్జెట్ సినిమాలు చేసినా, ప్రపంచవ్యాప్త పాపులారిటీ సొంతం చేసుకున్నా, తన నిజ జీవితంలోని వినయం, స్వచ్ఛమైన నవ్వు, ఎదుటివారికి ఇచ్చే గౌరవంతో ప్రభాస్ ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో 'డార్లింగ్'గానే ఉంటారు. ఆయన క్రేజ్ తగ్గకపోవడానికి, రోజురోజుకీ పెరుగుతుండటానికి కారణం ఆ సింప్లిసిటీ మరియు మాస్ మాసివ్ సినిమాల పర్ఫెక్ట్ కాంబినేషనే.
[Prabhas Craze Secret, Prabhas Birthday special, Prabhas Craze Reason, Prabhas Simplicity, Kalki 2 Updates, Fauji Prabhas Movie, Prabhas Pan India Movies, Telugunews, TeluguCinema, Tollywood, Tollywood News]




