
స్వచ్ఛమైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి ఎక్స్ పైరీ డేట్ ఉండదనే ధైర్యాన్ని ఇచ్చిన చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'. థియేటర్ ముఖం చూసి చాలా రోజులు దాటిపోయిన వాళ్ళని సైతం థియేటర్స్ కి రప్పించిందంటే 'విశ్వనాధ్ అండ్ సన్స్' సృష్టించిన సునామిని అర్ధం చేసుకోవచ్చు. 25 రోజుల్లోనే సాధించిన 250 కోట్ల రూపాయలే సునామి యొక్క సజీవ సాక్ష్యం.
ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో తన అల్లరి హంగామా వినిపించడానికి స్ట్రీమింగ్ డేట్ సిద్ధం చేసుకుంది.ఈ నెల 11 నుండి ఈ సూపర్ హిట్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఏకకాలంలో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం తమ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ, "అథ్లెట్, బిలియనీర్, ఫిలాంత్రపిస్ట్ మరియు ఒక అనురాగగల తండ్రి అయిన సంజయ్ విశ్వనాథ్ క్యారక్టర్ ని కలిసేందుకు సిద్ధంగా ఉండండి" అంటూ పోస్టర్ విడుదల చేసింది. దీంతో అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు.
Also Read: Ramayana: పార్ట్ 1 లో యష్ స్క్రీన్ టైమ్ ఇంతేనా: రావణుడిగా విశ్వరూపం తప్పదా!

వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ నిర్మించగా ఆగస్టు 14న థియేటర్స్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.
[vishwanath And Sons, Suriya, Mamitha Bhaiju,Venky Atluri, Ott date, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]






