
'గిర గిర గింగిరాగిరే' అంటూ అనస్వర రాజన్ ఏమంటు తెలుగు తెరపై చిందులేసిందో గాని, ఇప్పుడు వరుసపెట్టి పలు ఆఫర్స్ తన చుట్టూ గిర గిర తిరుగుతున్నాయి. ఈ కోవలోనే మెగాస్టార్ చిరంజీవి, బాబీ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ 'కాకా' (Kaaka) లో చిరు డాటర్ గా ఆఫర్ దక్కించుకొని తెలుగు ప్రేక్షకుల డైలీ చిట్ చాట్ లో ఉంది.
ఈ రోజు అనస్వర రాజన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా 'కాకా' మేకర్స్ బర్త్ డే విషెస్ చెప్తూ ' హార్ట్ ఆఫ్ కాకా, అమ్ములు పాప అనే క్యాప్షన్ తో కూడిన అనస్వర లుక్ రిలీజ్ చేసారు. సదరు లుక్ తో అనస్వర మెడిసిన్ చదువుతున్న ఏంబిబిఎస్ స్టూడెంట్ అని అర్ధం అవుతుంది. అలాగే తన ఫేస్ ఎక్స్ ప్రెషన్ చూస్తుంటే మనసులో ఎలాంటి కల్మషం లేని అమాయకత్వపు మోముతో ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో చిరు షాడో కనపడుతూ ఉంది దీంతో అభిమానులతో పాటు నెటిజెన్స్ ఎవరకి తోచిన విధంగా వారు కథని అల్లుకునే బిజీలో ఉన్నారు.
Also Read: విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటిటి డేట్ ఇదే: కాకపోతే తెలుగు ఫ్యాన్స్ కి మాత్రం....!
.webp)
పోస్టర్ రిలీజైన కాసేపటికే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికలపై రికార్డ్స్ సాధించే పనిలో కాకా టీం ఉంది. అనస్వర స్వస్థలం కేరళలోని కరివెల్లూరు.
[Anaswara Rajan, Chiranjeevi, Kaaka, Look Release, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]






