Home

»

Latest News

మరో స్క్విడ్ గేమ్‌లా కల్ట్: విశ్వక్ సేన్ మూవీ ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్.!

Oct 19, 2026 1:24PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి తన రూటే సెపరేటు అన్నట్టుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈసారి నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా బాధ్యతలు తీసుకుని ‘కల్ట్’ సినిమాతో రాబోతున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ట్రైలర్‌లో కనిపించిన రక్తపాతం, యాక్షన్ సన్నివేశాలు, విశ్వక్ సేన్ మాస్ డైలాగ్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే, ఈ వైలెన్స్‌పై ప్రశంసలతో పాటు కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ ట్రైలర్‌లో గోవాలోని ఓ దీవిలో చిక్కుకున్న సుమారు 300 మంది ప్రాణాల కోసం పోరాడే భయంకరమైన గేమ్‌ను చూపించారు. మొదట సరదాగా మొదలయ్యే వ్యవహారం.. ఆ తర్వాత ప్రాణాలు తీసే ఆటగా మారుతుంది. ఈ గేమ్‌లో ఓడిపోయిన వారికి ఎదురయ్యే పరిణామాలు, కనిపించే క్రూరమైన సన్నివేశాలు ట్రైలర్‌ను మరింత ఇంటెన్స్‌గా మార్చాయి. హాలీవుడ్‌లో కనిపించే స్లాషర్ థ్రిల్లర్ తరహా కథనాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం ఇందులో కనిపిస్తోంది.

ఇక విశ్వక్ సేన్ లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కూడా ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఆయన గురించి శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పే డైలాగ్ సోషల్ మీడియాలో హైలైట్‌గా మారింది. మరోవైపు, రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలకు మరింత తీవ్రతను తీసుకొచ్చింది.

అయితే, ట్రైలర్‌కు వస్తున్న స్పందన పూర్తిగా ఒకేలా లేదు. కొత్త జానర్‌లో విశ్వక్ సేన్ చేస్తున్న ప్రయత్నాన్ని కొందరు అభినందిస్తుంటే.. మరికొందరు మాత్రం ఇంతటి రక్తపాతం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా హింసాత్మక సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతాయనే చర్చ మొదలైంది. అయితే ఇది యూత్ ని టార్గెట్ చేసుకొని తీసిన సినిమా అని ఇప్పటికే విశ్వక్ చెప్పడం విశేషం.

గతంలో ‘ఫలక్‌నుమా దాస్’, ‘దాస్ కా ధమ్కీ’ సినిమాలకు దర్శకత్వం వహించిన విశ్వక్ సేన్.. ఇప్పుడు ‘కల్ట్’తో మరోసారి మెగాఫోన్ పట్టుకున్నారు. ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తారక్ సినిమాస్‌పై సందీప్ కాకరాల నిర్మిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 30న థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. ట్రైలర్‌తోనే ఇంతటి చర్చకు తెరలేపిన ‘కల్ట్’.. వెండితెరపై ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుంది? కొత్త తరహా స్లాషర్ థ్రిల్లర్‌గా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది? అనేది చూడాలి.

ఇది కూడా చదవండి: హాలీవుడ్‌లో ‘రామాయణ’ గ్రాండ్ ప్రీమియర్.. అతిథులంతా భారతీయ సంప్రదాయ దుస్తుల్లోనే.!

 

 

 

[Vishwak Sen Cult Trailer Response, Vishwak Sen Cult Trailer, Vishwak Sen Cult Movie, Cult Movie Release Date, Vishwak Sen, Cult Trailer, Cult Movie, Gayatri Bharadwaj, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com