Home

»

Bollywood News

హాలీవుడ్‌లో ‘రామాయణ’ గ్రాండ్ ప్రీమియర్: అతిథులంతా భారతీయ సంప్రదాయ దుస్తుల్లోనే.!

Oct 19, 2026 1:07PM

భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ను ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు  ‘రామాయణ’ చిత్ర బృందం భారీ స్థాయిలో సిద్ధమవుతోంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి తాజాగా మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. సినిమా విడుదలకు ముందే అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో వరల్డ్ ప్రీమియర్ నిర్వహించనున్నారు. అయితే ఈ వేడుకలో ప్రత్యేకత ఏంటంటే.. అతిథులంతా భారతీయ సంప్రదాయ దుస్తుల్లో రావాలని కోరడం.

ఈ వరల్డ్ ప్రీమియర్ అక్టోబర్ 27న లాస్ ఏంజెల్స్‌లోని అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో జరగనుంది. అక్కడి డేవిడ్ గెఫెన్ థియేటర్‌లో సినిమాను 3డీ ఫార్మాట్‌లో ప్రదర్శించనున్నారు. ఈ వేడుకకు దాదాపు 945 మంది హాజరుకానున్నట్లు సమాచారం. హాలీవుడ్ ప్రముఖులు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు, దర్శకులు, సినీ పరిశ్రమకు చెందిన కీలక వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీపావళి పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించనున్నారు.

ఇక అతిథులు భారతీయ సంప్రదాయ దుస్తుల్లో రావాలనే ఆహ్వానం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రపంచ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పాలన్నది చిత్ర బృందం ఆలోచనగా కనిపిస్తోంది. సాధారణంగా హాలీవుడ్ ఈవెంట్లలో కనిపించే రెడ్ కార్పెట్ హంగామాకు భారతీయ పండుగ వాతావరణాన్ని జోడించడం ఈ ప్రీమియర్‌కు ప్రత్యేకతను తీసుకొస్తోంది.

దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోంది. భారీ విజువల్స్‌తో భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించాలన్నది మేకర్స్ లక్ష్యం.

మొదటి భాగం నవంబర్ 5, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రెండో భాగాన్ని 2027 దీపావళికి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.

మొత్తానికి, భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే క్రమంలో ‘రామాయణ’ వరల్డ్ ప్రీమియర్‌ను కూడా ఒక ప్రత్యేకమైన వేడుకగా మార్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. మరి ఈ భారీ చిత్రానికి హాలీవుడ్ ప్రముఖుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: ఆకాశంలో ఒక తార.. విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్.. షాక్‌లో ఇండస్ట్రీ.!

 

 

 

[Ramayana World Premiere At Academy Museum, Ramayana World Premiere, Ramayana Academy Museum, Ramayana Movie, Ranbir Kapoor, Yash, Sai Pallavi, Nitesh Tiwari, Namit Malhotra, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com