Home

»

Latest News

కల్ట్ రిలీజ్ డేట్ ప్రోమో: విశ్వక్ సేన్ విశ్వరూపం.!

Sep 19, 2026 7:25PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అప్ కమింగ్ మూవీ 'కల్ట్‌'. విభిన్నమైన కథాంశాలతో ప్రయోగాలు చేసే విశ్వక్ ఈ చిత్రంలో నటించడంతో పాటు రచన-దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. ఫ‌ల‌క్‌నుమాదాస్, దాస్‌ కా ధమ్కీ తర్వాత విశ్వక్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకర్ల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఇండియాస్ ఫస్ట్ అథెంటిక్ స్లాషర్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు.

నిజ జీవితంలో జరిగిన కొన్ని కలవరపరిచే సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాను రూపొందిస్తున్నారు. డార్క్, ఇంటెన్స్, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్‌గా #CULT తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన ప్రపంచాన్ని, కథా నేపథ్యాన్ని పరిచయం చేస్తూ క్యూరియాసిటీ పెంచింది. అలాగే స్నేహాన్ని పరిచయం చేస్తూ విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు కూడా మంచి స్పందన లభించింది.

తాజాగా మేకర్స్ 'కల్ట్‌' రిలీజ్ డేట్‌ను థ్రిల్లింగ్ గ్లింప్స్ ద్వారా ప్రకటించారు. అక్టోబర్ 30 నుంచి ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది.

ఇది కూడా చదవండి: ఇట్లు అర్జున టీజర్.. సైలెంట్ లవ్ స్టోరీ.. సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్.!

రిలీజ్ డేట్ గ్లింప్స్ మరోసారి సినిమా కథా నేపథ్యంపై ఆసక్తిని పెంచింది. విశ్వక్ సేన్ ఇంటెన్స్ కిల్లింగ్ స్ప్రీ, కోపంతో కూడిన యాటిట్యూడ్ ఈ వీడియోను మరింత షాకింగ్‌గా మార్చాయి. ముఖ్యంగా విశ్వక్ సేన్ తొలిసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. సినిమా ఎలాంటి డార్క్ వరల్డ్‌లోకి తీసుకెళ్లబోతుందో ఈ విజువల్స్ హింట్ ఇచ్చాయి. రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టెన్షన్, క్యూరియాసిటీని మరింత పెంచింది.

ఇంటర్నేషనల్ అప్పీల్ ఉన్న కథను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో 'కల్ట్‌'ను తెలుగు, హిందీ, ఇంగ్లిష్, జపనీస్, స్పానిష్ భాషల్లో మల్టీలింగ్వల్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

మీకు నచ్చవచ్చు: ఏ పువ్వు ఏ తేటిదన్నది.. 'ఆకాశం ఏనాటిదో' పాటలో ఆ లైన్లకు అర్థం తెలుసా.?

 

 

 

[CULT Release Date Promo, CULT Movie Release Date, Cult Movie Telugu, Vishwak Sen, Gayatri Bharadwaj, Telugu Movies 2026, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com