Home

»

Latest News

ఇట్లు అర్జున టీజర్: సైలెంట్ లవ్ స్టోరీ.. సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్.!

Sep 19, 2026 6:34PM

ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారి చేస్తున్న మూవీ 'ఇట్లు అర్జున'. యంగ్ హీరో అనీష్, అనస్వర రాజన్ జంటగా నటించిన ఈ సినిమాకి మహేష్ ఉప్పాల దర్శకుడు. అక్టోబర్ 30న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలయింది.

ఇందులో హీరో అనీష్ మాటలు రాని వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అలాంటి వ్యక్తి హీరోయిన్ అనస్వర రాజన్ ప్రేమ ఎలా పొందాడు? ఇద్దరి మనసులు ఎలా మాట్లాడుకున్నాయి? అనేది టీజర్ లో ఆసక్తికరంగా చూపించారు.

హీరో పాత్రను డిజైన్ చేసిన తీరు బాగుంది. "అతను చాలా చెప్పాలనుకుంటాడు, కానీ ఎవ్వరికీ అర్థం కాదు" అంటూనే.. అతని ప్రేమను, ఎమోషన్ ని ఎవరైనా సరే ఫీల్ అవ్వాల్సిందే అని ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది. హీరోయిన్ తో కనెక్ట్ అవ్వడానికి హీరో పడే ఆరాటం, సైగలతోనే చెప్పే క్యూట్ లవ్ సీన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా ఉన్నట్టుగా టీజర్ లో చూపించారు. విజువల్స్, థమన్ మ్యూజిక్ కూడా ఆకట్టుకున్నాయి. 

ఇది కూడా చదవండి: 37 సీక్రెట్ ఇదే.. అల్లు అర్జున్ 'రాకా'లో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్.!

మీకు నచ్చవచ్చు: పెళ్ళంటే పందిళ్ళు.. పెళ్ళి పాటను ఇలా రాయడం ఆత్రేయకే సాధ్యం.!

 

 

 

[Itllu Arjuna Teaser, Itlu Arjuna Teaser, Aniesh, Anaswara Rajan, Venky Kudumula, Mahesh Uppala, Thaman S, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com