Home

»

Latest News

Vishnu Vinyasam: విష్ణు విన్యాసం మూవీ ఫస్ట్ రివ్యూ!

Feb 26, 2026

కొన్ని జానర్ సినిమాలు కొందరు హీరోలకు కరెక్ట్ గా సెట్ అవుతాయి. ఈ జనరేషన్ లో ఎంటర్టైన్మెంట్ సినిమాలకు హీరో శ్రీవిష్ణు సరిగ్గా సరిపోతాడు. 'సామజవరగమన', 'సింగిల్' వంటి సినిమాలతో థియేటర్లలో నవ్వులు పూయించి మంచి విజయాలను ఖాతాలో వేసుకున్నాడు శ్రీవిష్ణు. ఇప్పుడు 'విష్ణు విన్యాసం'తో మరోసారి కామెడీ ట్రీట్ కి రెడీ అయ్యాడు.

శ్రీవిష్ణు, నయన్ సారిక జంటగా నటించిన మూవీ 'విష్ణు విన్యాసం'(Vishnu Vinyasam). మారుతీరావు దర్శకత్వంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్, రేపు( ఫిబ్రవరి 27) విడుదలవుతోంది. ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. 'సామజవరగమన', 'సింగిల్' తరహాలో శ్రీవిష్ణు ఖాతాలో మరో విజయం పడటం ఖాయమనే నమ్మకాన్ని కలిగించాయి. ఇక ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ సినిమా గురించి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. (Vishnu Vinyasam First Review)

సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గానే ఉంది. రెండు గంటల నిడివితో తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ లభించింది. అవుట్ పుట్ కూడా అదిరిపోయింది అంటున్నారు. రెండు గంటల పాటు నాన్ స్టాప్ నవ్వులు పంచేలా సినిమాని మలిచారట.

ఫస్ట్ హాఫ్ శ్రీవిష్ణు శైలి కామెడీతో యూత్ ని అట్రాక్ట్ చేసేలా ఉంటే, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఉంటుందట. న్యూమరాలజీ పిచ్చి ఉన్న జూనియర్ లెక్చరర్ పాత్రలో విష్ణు అదరగొట్టాడట. కామెడీ టైమింగ్ మాములుగా లేదని చెబుతున్నారు.

Also Read: 'ఆయా షేర్' హుక్ స్టెప్ కాపీ అంటూ ట్రోల్స్.. యువరాజ్ సింగ్ ఎంత పని చేశాడు!

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com