Home

»

Latest News

Thaman: అడ్డంగా దొరికిపోయాడు.. ఆ కొత్త జంట గురించి అలా మాట్లాడొచ్చా!

Feb 26, 2026


 

-సోషల్ మీడియాలో వైరల్ గా మారిన థమన్ 
-ఆ యువ జంట గురించి మాట్లాడింది నిజమేనా 
-అసలు ఏం మాట్లాడాడు 
-వివరాలు చూద్దాం


థమన్(Thaman).. సంగీతంలో ఉన్న మాధుర్యాన్ని సంగీత ప్రియులకి అందించడానికే ఉదయించిన సంగీత సూర్యుడు అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ట్రాక్ రికార్డు ఆ విధంగా ఉంది మరి. మాస్ సాంగ్స్ ని ఇష్టపడే వాళ్ళని క్లాస్ సాంగ్స్ వైపు , క్లాస్ సాంగ్స్ ని ఇష్టపడే వాళ్ళని మాస్ సాంగ్స్ వైపు డైవర్ట్ చేయడంలో కాకలు తీరిన సిద్ద హస్తుడు. అందుకే సుదీర్ఘ కాలం నుంచి సంగీత సినీ ప్రపంచంలో దూసుకుపోతున్నాడు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మ్యూజిక్ కి సంబంధించి కాకుండా మౌత్ నుంచి వచ్చిన ఒక మాటతో వైరల్ గా నిలిచాడు.

థమన్ రెండు రోజుల క్రితం 'బ్యాండ్ మేళం'(Band Melaam)అనే అప్ కమింగ్ మూవీ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యాడు. కోర్టు మూవీ ఫేమ్ రోషన్(Roshan),శ్రీదేవి(Sridevi)మరో సారి జంటగా చేస్తున్నారు. థమన్ ఆ ఇద్దర్ని ఉద్దేశించి  మాట్లాడుతు మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది, కానీ ఆ కెమిస్ట్రీ కాస్తా ఫిజిక్స్ కాకుండా చూసుకోండి అని మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఈ మాటలు నిదానంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో థమన్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. దీంతో థమన్ ఆ విధంగా ఎలా మాట్లాతాడని  విరుచుకుపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. థమన్ ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు.అదేంటి అలా ఎలా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారా!  కెమిస్ట్రీ కాస్తా ఫిజిక్స్ కాకుండా చూసుకోండి అని చెప్పిన తర్వాత మళ్ళీ తన మనసులో కెమిస్ట్రీ అంటే ఉన్న భావం గురించి చెప్పుకొచ్చాడు.

also read: Virosh Wedding: ఘనంగా జరిగిన పెళ్లి.. అదిరిపోయిన తెలంగాణ స్పెషల్ డిష్!

 కెమిస్ట్రీ అంటే నేను వేరే ఉద్దేశ్యంతో అనలేదు. మీరిద్దరూ భవిష్యత్తులో గొడవలు పడకండి అని మాత్రమే చెబుతున్నా. మీ పెయిర్ చూడటానికి చాలా బాగుంది, ఎప్పుడూ ఇలాగే కలిసుండండి. అసలే నేను ఐదో తరగతి ఫెయిల్ అయ్యాను.. నాకేం పెద్దగా తెలియదు'అని చెప్పుకొచ్చాడు. అందుకే కొంత మంది పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. నెగిటివ్ వీరులు మాత్రం ఆగడం లేదు. 

 

      

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com