Home

»

Latest News

విజయ్ ఫోన్ కాల్ సీక్రెట్ బయటపెట్టిన విజయ్ సేతుపతి.. ఫుల్ వైరల్ మామ!

Sep 19, 2026 4:48PM

 

 

'ఇళయ దళపతి విజయ్'.. 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి.. తమిళ చిత్ర పరిశ్రమకే కాకుండా సౌత్ సినీ పరిశ్రమకి దొరికిన పవర్ ఫుల్ సినీ ముత్యాలు. విజయ్ సేతుపతి, ఇటీవల మాట్లాడిన మాటలు తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విజయ్‌ని  ఉద్దేశించి చేసినవే అనే రూమర్స్ చాలా కాన్ఫిడెన్స్ గానే చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు వాటన్నిటికీ విజయ్ సేతుపతి వివరణ ఇవ్వడంతో రూమర్స్ కి దిక్కుతోచని పరిస్థితి.  

విజయ్ సేతుపతి మాట్లాడుతు "ఒకసారి విజయ్ గారి కుమారుడు జాసన్ సంజయ్ పుట్టినరోజు సందర్భంలో నేను సంజయ్‌కి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశాను. ఆ విషయం తెలుసుకున్న విజయ్ సర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా నాకే ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తగానే 'డియర్ ఫ్రెండ్' అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. మీరు మా అబ్బాయికి విష్ చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. అంతటి తిరుగులేని సూపర్ స్టార్ హోదా ఉన్న వ్యక్తి నుంచి అలా ఫోన్ రావడం నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఆయన వ్యక్తిగతంగా ఎంతో నిరాడంబరంగా ఉంటారు" అని సేతుపతి కొనియాడారు. ఈ మాటలతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలన్నీ కేవలం కల్పిత రూమర్లేనని స్పష్టమైంది. 

 


 

ఇది కూడా చదవండి: ఈ సారి ఆ సీక్రెట్ మిషన్ తో మూవీ వస్తుందా: చైనా సైన్యానికి చిక్కిన భారత ఏజెంట్లు!


సూపర్ స్టార్ రజనీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మైలురాయి చిత్రం 'జైలర్ 2' గురించి కూడా ఆయన కీలక ప్రకటన చేశారు. సాధారణంగా తాను ఇతర హీరోల సినిమాల్లో స్పెషల్ క్యామియోలు లేదా గెస్ట్ రోల్స్ చేయడం ఎప్పుడో నిలిపివేశాను. ఒకే పోస్టర్‌పై తన ఫోటో, మరో హీరో ఫోటో ఉంటే ప్రాధాన్యతలు మారిపోయి, తాను సోలో హీరోగా చేసే సినిమాలపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతోనే క్యామియోలకు దూరంగా ఉంటున్నాను. కానీ, కేవలం ఒక్క రజనీకాంత్ గారి కోసమే తన సొంత నిబంధనను పక్కనపెట్టి 'జైలర్ 2'లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని తెలిపారు. దీంతో జైలర్ 2 ఇచ్చి సినీ కిక్ స్థాయి పెరగనుంది.  

 

మీకు నచ్చవచ్చు : మీర్జాపూర్ భామ వ్యాఖ్యలు వైరల్: టాలెంట్ ఉంటే చాలదు.. అలా అనిపిస్తే అవకాశం

 

[Vijay Sethupathi, Vijay, Vijay Sethupathi About Thalapathy Vijay phone Call, Jailer 2 Cameo, Telugu Cinema, telugu cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com