Home

»

Latest News

నిన్న విడుదలైన మూవీ: ఆ డైలాగ్ తో విడిపోయిన భార్య, భర్త ఆలోచనలో పడతారా!

Sep 19, 2026 3:44PM

 


సీనియర్ దర్శకుడు ఆ నలుగురు ఫేమ్ 'చంద్ర సిద్దార్ధ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఈ పాట కోరిన వారు నెమలి పాలెం నుండి'  నిన్న సెల్యులాయిడ్ ని తన వశం చేసుకోవడానికి వచ్చింది. ప్రేక్షకుల టాక్ తో పాటు మెజారిటీ రివ్యూస్ పర్వాలేదనే స్థాయిలోనే వస్తున్నాయి. 


ముఖ్యంగా ఈ చిత్రంలోని కొన్ని డైలాగ్స్ కి మంచి పేరు వస్తుంది.  ముఖ్యంగా ఒక సన్నివేశంలో హీరో క్యారక్టర్ పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్న ఒక అమ్మాయితో భర్త దగ్గర్నుంచి ఎందుకు విడిపోయారు! బాగా తాగుబోతా! మిమల్ని సరిగా చూసుకునే వాడు కాదా! అనుమాన పక్షా అని అడుగుతాడు. అప్పుడే ఆమె అతను చాలా మంచి వాడు అంటుంది. మరి మీరు మంచి వారు కాదా అని హీరో అంటాడు. నేను మంచిదాన్నే అంటుంది. మీ ఇద్దరు మంచి వాళ్ళు అయినప్పుడు ఎందుకు విడిపోయారు అంటాడు. అప్పుడు ఆమె' ఒక్కోసారి ఇద్దరు మంచి మనుషులు మంచి భార్య భర్తలుగా కలిసి ఉండలేరని చెప్తుంది.


ఇది కూడా చదవండి: 9 సినిమాల్లో ఒకే ఒక్క హిట్: అయినా తగ్గని క్రేజ్: ఎందుకని!

 

 

 ఆ మాట కేవలం ఒక సినిమా సంభాషణ మాత్రమే కాదు, మానవ సంబంధాల లోతుని , మారుతున్న సామాజిక విలువల స్వభావాన్ని విశ్లేషించే ఒక అద్భుతమైన వేదిక. ప్రస్తుత సమాజంలో మరియు నేటి ఆధునిక జీవనశైలిలో 90% కంటే ఎక్కువ మంది మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక సవాళ్లు మరియు కమ్యూనికేషన్ లోపాల వల్ల తమ బంధాలలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఏది ఏమైనా మనుషుల్లో లోపాలు ఉండటం సహజం. అసలు లోపాలు లేనోడు మనిషే కాదు. సో నెమలి పాలెం లోని ఆ అద్భుతమైన డైలాగ్ విని విడిపోయన భార్య భర్తలు ఆలోచనలో పడతారేమో చూద్దాం. సినిమా గట్టిగా అనుకోవాలే గాని అయిపోతుందంతే. 

మీకు నచ్చవచ్చు : ' ఈ పాట కోరిన వారు నెమలి పాలెం నుండి'  మూవీ రివ్యూ  

 

[Ee paata Korinavaaru nemalipalem Nundi Movie Review, Ee paata Korinavaaru nemalipalem Nundi, Chandra Siddhardh,Telugu Cinema, telugu cinema News, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com