Home

»

Latest News

వేణుమాధవ్ ఇంటి పేర్ల రహస్యం: ఇన్నాళ్ళకి బయటపడింది!

Sep 28, 2026 5:28PM


ఈ నిమిషానికి కూడా లెజండ్రీ కామెడీ నటుడు వేణు మాధవ్ నుంచి వచ్చిన  కామెడీ సీన్స్, డైలాగ్స్  గురించి చెప్పుకొని వారంటూ ఉండరు. మహా మహా కామెడీ నటులు సెల్యులాయిడ్ ని ఏలుతున్న రోజుల్లో తనకంటూ ఒక సపరేట్ మాడ్యులేషన్ సృష్టించుకున్నాడు. బడా బడా హీరోలే వేణుమాధవ్ అభిమానులు. ఈ రోజు వేణుమాధవ్ జయంతి. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, చెక్కుచెదరని జ్ఞాపకాలు ఇప్పటికీ అభిమానుల గుండెల్లో పదిలంగానే ఉన్నాయి. 


తన సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన వేణు మాధవ్, వ్యక్తిగత జీవితంలోనూ అత్యంత సాదాసీదాగా, విలువలకు పెద్దపీట వేస్తూ జీవించారు. అయితే ఆయన సొంతంగా నిర్మించుకున్న ఇళ్లకు పెట్టిన పేర్ల వెనుక ఒక అత్యంత అరుదైన, ఆసక్తికరమైన కథ ఉందనే విషయం చాలామందికి తెలియదు. సాధారణంగా సినీ రంగానికి చెందిన నటీనటులు తాము ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లకు సొంత పేర్లు పెట్టుకోవడం చూస్తుంటాం. కానీ వేణు మాధవ్ మాత్రం తన రియల్ ఎస్టేట్ ఆస్తుల విషయంలో ఒక విభిన్నమైన, ప్రేమానురాగాలతో కూడిన దారిని ఎంచుకున్నారు. వేణు మాధవ్ గతంలో ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన ఇళ్ల పేర్ల గురించి స్పందిస్తూ 'నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో నిర్మించిన ప్రతి ఇంటికి కూడా ఒకే రకమైన పేరు పెట్టాను. ఆ పేరు మరేదో కాదు, "అచ్చి వచ్చిన కృష్ణ నిలయం". ఈ ఇళ్లకు 'అచ్చి వచ్చిన కృష్ణా నిలయం' అనే పేరు ఉంటుందని, కృష్ణా రెడ్డి, అచ్చిరెడ్డి పేర్లతో కలిపి ఈ పేరు పెట్టారని వివరించారు. మౌలాలి హౌసింగ్ బోర్డ్ నుండి మంగాపురం కాలనీ వరకు పలు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు తనకే ఉన్నాయని, వాటిని అద్దెకు ఇచ్చానని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: శివకార్తికేయన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ వెంకట్ ప్రభు: అసలు నిజం ఇదన్నమాట!

 


అచ్చి వచ్చిన కృష్ణా నిలయం అనే పేర్లు ఎవరివో కాదు ప్రొడ్యూసర్ అచ్చిరెడ్డి, దర్శకుడు కృష్ణారెడ్డి.  మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన వేణు మాధవ్.. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘సంప్రదాయం’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. అందుకే తనకి సినీ జన్మని ప్రసాదించిన ఆ ఇద్దరి పేర్లుని తమ ఇళ్ళకి పెట్టుకున్నాడు. ఆయన జయంతి సందర్భంగా మరోసారి ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

[Venu Madhav House Names Secret, Venu Madhav, Sv Krishana Reddy, Achhireddy, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com