Home

»

Latest News

దేవర 2 పై హల్ చల్ చేస్తున్న నయా రూమర్: ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి!

Sep 28, 2026 5:47PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన క్యారక్టర్ యొక్క ఔన్నత్యాన్ని, లక్ష్యాన్ని, మెరుపుల్ని కళ్ళతోనే పండించగలడని దేవర తో మరో సారి నిరూపించాడు. కలెక్షన్స్ పరంగా కూడా  450 కోట్ల క్లబ్ ని అందుకోవడంతో దేవర సునామి ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. మరి ఫ్యాన్స్, ప్రేక్షకులు మౌనంగా ఉంటారా ఏంటి? దేవర 2 ఎప్పుడని సోషల్ మీడియా వేదిక పాటు ఏ వేదిక పడితే ఆ వేదిక సాక్షిగా రచ్చ చేయని రోజు లేదు. 

ఈ క్రమంలోనే పార్ట్ 2 కి సంబంధించిన రూమర్ ఒకటి దేదీప్యమానంగా వెలిగొందుతూ అందరికి హాయ్ చెప్తుంది. సదరు సమాచారం ప్రకారం ‘దేవర సీక్వెల్’ వచ్చే ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్. బాలకృష్ణతో కొరటాల శివ చేయనున్న సినిమా పూర్తయిన తర్వాత ఆయన ‘దేవర 2’పై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న సినిమాను పూర్తి చేసిన తర్వాత ఈ సీక్వెల్ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.


ఇది కూడా చదవండి: వేణుమాధవ్ ఇంటి పేర్ల రహస్యం: ఇన్నాళ్ళకి బయటపడింది!

 


ఇక ‘దేవర సీక్వెల్’కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని టాక్ వినిపిస్తోంది. దీంతో సరైన సమయం చూసుకుని షూటింగ్ ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్ ప్రారంభ తేదీపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఏది ఏమైనా 'దేవర 2 ' త్వరగా స్టార్ట్ అవ్వాలని ఫ్యాన్స్ నిత్యం కోరుకుంటూనే ఉన్నారు.

 

 

[Devara 2 Update, Ntr About Devara 2, Devara 2 Shooting update,  NTR Dragon movie, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com