
వారణాసి రిలీజ్ తర్వాత ప్రతి తెలుగు ప్రేక్షకుడు ఇది మా తెలుగు సినిమా అని వరల్డ్ సినిమాకి సోషల్ మీడియా వేదికగా చాటి చెప్పాలనే లక్ష్యంతో ఉన్నారు. కానీ రిలీజ్ కి ముందే గర్వంగా చెప్పుకోవలసి వస్తుందని ఎవరు ఉహించుకోలేదు. సో, ఇప్పుడు అందరూ ఆ పని మీదే ఉన్నారు. మరి ప్రపంచ సినిమా, మేకర్స్ కి వారణాసి ఇచ్చిన షాక్ ఏంటో చూసేద్దాం.
ప్రముఖ గ్లోబల్ ఫార్మాట్ ఐమ్యాక్స్ (IMAX) అధికారిక యూట్యూబ్ ఛానెల్లో విడుదలైన 'వారణాసి' గ్లింప్స్ చరిత్ర సృష్టించింది. హాలీవుడ్ దిగ్గజ చిత్రాల అనేక ట్రైలర్లు, టీజర్లను వెనక్కి నెట్టి ఏకంగా 10 మిలియన్లకు పైగా వ్యూస్ని సొంతం చేసుకొని ఐమ్యాక్స్ యూట్యూబ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి వీడియోగా నిలవడం విశేషం. ఇప్పటి వరకు అవతార్ ది వే ఆఫ్ వాటర్ 82 .5 లక్షల వ్యూస్ తో అగ్ర స్థానంలో ఉండగా,మార్వెల్ అద్భుత సృష్టి డాక్టర్ స్ట్రేంజ్ 41 .4 లక్షల వ్యూస్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. మరి ఆ రెండు చిత్రాలు వారణాసి కోటి అందుకోవడంతో తమ ప్లేస్ లని ఇష్టం ఉన్నా లేకపోయినా మార్చుకోవాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: ఇమాన్వి బర్త్ డే: ప్రభాస్ అదిరిపోయే గిఫ్ట్!

మరి ఈ రికార్డుని వారణాసి మేకర్స్ గౌరవిస్తారు కనుక ఏ రేంజ్ లో వారణాసిని తెరకెక్కిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
[varanasi Glimpse Imax Youtube Record, Varanasi glimpse record, SS Rajamouli, Mahesh Babu, IMAX YouTube history,Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]





