
విభిన్న క్యారెక్టర్స్ తో ఆకట్టుకునే శ్వాసిక విజయ్ ఈ రోజు విజయ్ ఆంటోనీతో కలిసి వంద దేవుళ్ళు తో థియేటర్స్ లో అడుగుపెట్టింది. మూవీపై నమ్మకంతో మేకర్స్ నిన్న ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
వాసవి(శ్వాసిక విజయ్) పెళ్ళి అయిన కొన్ని సంవత్సరాలకే భర్తని కోల్పోతుంది. ఇద్దరు పిల్లలు . పేర్లు భాస్కర్(అజయ్ ధీషాన్) వివేక్. ఆర్ధికంగా అత్యంత పేద కుటుంబం కావడంతో పలు రకాల పనులు చేస్తూ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. తనకి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆశ పుడుతుంది. కానీ కొడుకులు ఒప్పుకోరు. పైగా ద్వేషాన్ని పెంచుకుంటారు. మరి వాసవి కోరిక నెరవేరిందా? అసలు ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకొనేది శారీరక సుఖం కోసమా? లేక సమాజంలో ఏదైనా మార్పు తీసుకురావడం కోసమా? మరి ఈ కథలో ఏడుకొండలు(విజయ్ ఆంటోనీ) క్యారక్టర్ ఏంటి? అనేదే వంద దేవుళ్ళు
ఎనాలసిస్
భర్త చనిపోయిన తర్వాత ఆడవాళ్లు కొత్త జీవితాన్ని ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే పాయింట్ బాగుంది. ఇలాంటి కథలు ప్రస్తుత సమాజానికి చాలా అవసరం. మూవీ చూస్తున్నంత సేపు బాగానే ఉన్నా సినిమాటిక్ గా మలచడంలో మేకర్స్ కొంచం తడబడ్డారు. ఏడుకొండలు క్యారక్టర్ ని మొదటి నుంచే వాసవికి పారలల్ గా చూపిస్తూ ఏడుకొండల కూతురు కూడా తన తండ్రి రెండో పెళ్ళికి ఒప్పుకోవడం లేదని ఎస్టాబ్లిష్ చేయాల్సింది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మూవీ ప్రారంభమే మంచి ఇంట్రస్ట్ తో సాగడంతో . వాసవి క్యారక్టర్ కి సరెండర్ అవుతాం. పిల్లల కోసం ఆమె చేసే చిన్న చిన్న పనుల్ని మరింతగా ఎస్టాబ్లిష్ చెయ్యాల్సింది. వాసవి పెద్ద కొడుకుతో స్కూల్ మాస్టర్ మీ అమ్మకి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్తే వాసవితో కొడుకు ప్రవర్తించే తీరుకి సంబంధించిన సీన్ గూస్ బంప్స్. భాస్కర్ పెళ్లి చూపుల సీన్, యూ ట్యూబ్ కంటెంట్ ఎపిసోడ్ సూపర్ గా ఉండటంతో పాటు నవ్వులు పూయించింది. భాస్కర్, వాసవికి మధ్య వచ్చే కండిషన్ కాన్సెప్ట్ ఎక్స్టార్డినరీ. ఇంటర్వెల్ ట్విస్ట్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. సెకండ్ హాఫ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కంటే చాలా స్పీడ్ గా సాగింది. ఏడుకొండలు రాకతో డల్ గా ఉన్న కథనంలో స్పీడ్ రావడంతో పాటు వాసవి, ఏడుకొండల మధ్య వచ్చిన సీన్స్ చాలా బాగున్నాయి. కాకపోతే ఇంకా మరిన్ని సీన్స్ ఉండాల్సింది. వాసవిని పుట్టింటోళ్లే చంపడానికి ప్రయత్నించే సన్నివేశం ఒళ్ళు జలధరింపచేస్తుంది. నేటికీ సమాజంలో అలాంటి వాళ్ళు ఉన్నారనే విషయాన్నీ గుర్తుకి చేస్తుంది.చివరి ఇరవై నిమిషాలతో పాటు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎక్స్ టార్డినరీగా ఉన్నాయి
నటీనటులు, సాంకేతిక నిపుణల పని తీరు
వాసవిగా శ్వాసిక విజయ్ పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వితంతువుగా, ఇద్దరు కొడుకుల తల్లిగా భిన్న పార్శ్వాలున్న క్యారక్టర్ లో జీవించింది. ఉన్నత స్థాయితో కూడిన అవార్డు రావడం ఖాయం. నిడివి తక్కువైనా ఏడుకొండలుగా విజయ్ ఆంటోనీ తన పెర్ఫార్మ్ తో మెస్మరైజ్ చేసాడు. భాస్కర్ క్యారక్టర్ లో అజయ్ దిశన్ నూటికి నూరు శాతం సూట్ అయ్యి మెచ్యూర్డ్ పెర్ఫార్మ్ తో ఆకట్టుకున్నాడు. రెండో కొడుకుగా చేసిన నటుడుతో పాటు ఆల్ ఆర్టిస్ట్స్ తమ పెర్ఫార్మ్ తో మూవీకి హెల్ప్ అయ్యారు. శశి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. కానీ రచయితగా మరింత పదును పెట్టాల్సింది. ఫొటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ హైలెట్. నిర్మాణ విలువలు కథకి తగట్టుగా ఉన్నాయి.
బలాలు
1 . కథ
2 . శ్వాసిక విజయ్, విజయ్ ఆంటోనీ పెర్ ఫార్మెన్స్
3 . సెకండ్ హాఫ్
4 . ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్
5 .డైరెక్షన్
బలహీనతలు
1 . కొన్ని క్యారెక్టర్స్ చుట్టూనే కథ తిరగడం
2 . ఫస్ట్ హాఫ్
చివరిగా చెప్పుకోవాలంటే కథ మెయిన్ పాయింట్ తో పాటు శ్వాసిక విజయ్, విజయ్ అంథోని వంద దేవుళ్ళకి ప్రధాన బలంగా నిలిచారు.
రేటింగ్ 2 .5 /5 అరుణాచలం





