Home

»

Latest News

Udit Narayan: ఉదిత్ నారాయణ్ నా గర్భాశయాన్ని తీయించాడు.. కేసు నమోదు 

Feb 12, 2026

 


-సంచలనంగా మారిన ఉదిత్ నారాయణ్ కేసు
-నిజంగానే గర్భాశయాన్ని తీయించాడా!
-ఈ మాట చెప్తుంది ఎవరు


లెజండ్రీ సింగర్ ఉదిత్ నారాయణ్(Udit Narayan)'గానచరిత్ర' గురించి చెప్పుకోవాలంటే రోజులు, నెలలు చాలవు. సదరు గొంతు నుంచి వచ్చే పాట వినాలంటే పెట్టి పుట్టాలనే సామెత 
అయితే చాలా బలంగానే ఉంది. అంతలా తన గాత్రంతో  సంగీత ప్రియులని దశాబ్దాల నుంచి సమ్మోహన పరుస్తూ వస్తున్నాడు. ఆ సమ్మోహన గాత్రానికి ఉన్న పదును తగ్గలేదని నిరూపిస్తు రీసెంట్ గా 'మీసాల పిల్ల' తో భారీ హంగామా చేసాడు. మరి అంత ఘన చరిత్ర ఉన్న ఉదిత్ నారాయణపై ఆయన మాజీ భార్య తాజాగా చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.పైగా పోలీస్ కేసు నమోదు చేయించింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.


ఉదిత్ నారాయణ్ కి రెండు వివాహాలు. మొదటి భార్య పేరు 'రంజనా ఝా'(Ranjana Jha)కాగా 1984 లో వివాహం జరిగింది. ఆ తర్వాత దీప అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఇపుడు రంజనా ఝా బీహార్‌లోని సుపాల్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌ కి వెళ్లి ఉదిత్ నారాయణ్ 1996లో హెల్త్‌ చెకప్‌ పేరుతో  ఢిల్లీలో ఉన్న ఒక ఆసుపత్రికి తీసుకెళ్ళి నాకు తెలియకుండా గర్భాశయాన్ని తొలగించాడు. నాకు ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. అనారోగ్య సమస్యతో డాక్టర్ దగ్గరకి  వెళ్తే ఈ విషయం బయటపడింది. కావాలనే నాపై  కుట్ర చేశా రు.ఈ విషయంలో నాకు న్యాయం చెయ్యాలని కోరడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

also read: ఎన్టీఆర్ vs అల్లు అర్జున్.. ఈ సారి ఉత్తమ నటుడు ఎవరు!

గతంలోను ఆమె పలుసార్లు ఉదిత్ పై ఆరోపణలు చెయ్యడంతో పాటు  పోలీస్ కేసులు నమోదు చేయించింది. మరి ఈ విషయంపై ఉదిత్ నారాయణ్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. రంజనా ఝా కి విడాకులు ఇచ్చిన తర్వాత కోర్ట్ రూల్స్ మేరకు భరణం కింద కొంత డబ్బు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది.

 

 

 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com