The Paradise: ప్యారడైజ్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో కూడా...
on Feb 12, 2026

'దసరా' తరువాత న్యాచురల్ స్టార్ నాని(Nani), డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ది ప్యారడైజ్'(The Paradise). ఎస్ఎల్వీ సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 26న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
'ది ప్యారడైజ్' సినిమాని 2026 ఆగస్టు 21న రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
'దసరా' కాంబోలో వస్తున్న సినిమా కావడంతో 'ప్యారడైజ్'పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో నాని 'జడల్' అనే పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ లో నాని లుక్ హైలైట్ గా నిలిచింది. పొడవాటి జడలతో మునుపెన్నడూ చూడని కొత్త లుక్ లో నాని కనిపిస్తున్నాడు.
నాని పాన్ ఇండియా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. అలాంటిది 'ప్యారడైజ్'ను పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో కూడా విడుదల చేయనుండటం ఆసక్తికరంగా మారింది.
'ప్యారడైజ్' సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. మోహన్ బాబు, కయాదు లోహర్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read: 'ఫంకీ' బిజినెస్.. హిట్ కొట్టాలంటే అన్ని కోట్ల షేర్ రావాల్సిందే!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



