Home

»

Latest News

త్రివిక్రమ్ క్రేజీ ప్లాన్: ఆ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు..అసలు మ్యాటర్ ఇదేనా!

Sep 11, 2026 12:16PM

 

మాటకి గౌరవాన్ని, బిడియాన్ని,సిగ్గుని, మహత్తుని, హుందాతనాన్ని ఏకకాలంలో తీసుకొచ్చిన దర్శకుడు త్రివిక్రమ్. ప్రెజెంట్ విక్టరీ వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం తెరకెక్కిస్తూ, ఎన్టీఆర్ తో గాడ్ ఆఫ్ వార్ కి కూడా సిద్దమవుతున్నాడు. 


భారతీయ సినీ చరిత్రలో లేటెస్ట్ గా సంచలనాలు సృష్టిస్తూ వెళ్తున్నచిత్రం 'హనుమాన్ అంశ్'. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, నీం కరోలీ బాబా మహరాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. హిందీలో అసాధారణ విజయం సాధించిన ఈ విజువల్ డివైన్ వండర్‌ని ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులోకి తీసుకురాబోతున్నాడు. అంటే రిలీజ్ బాధ్యతలని తీసుకున్నాడు. ఈ విషయాన్ని హనుమాన్ అంశ్ నిర్మాత 'నమ్రతా సింగ్' స్వయంగా వెల్లడించారు. తెలుగు చిత్రసీమలో విలక్షణ కథాంశాలని, ఆధ్యాత్మిక స్పర్శ ఉన్న సినిమాలని ఆదరించే ప్రేక్షకులు ఎక్కువ. ఈ క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెలుగులో సమర్పించబోతుండటంతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఆధ్యాత్మికతని, భారతీయ సంస్కృతిని అత్యున్నత రీతిలో గౌరవించే త్రివిక్రమ్ ఈ సినిమా బాధ్యతలను స్వీకరించడం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు.

 


Also read: షాకింగ్ కలెక్షన్స్: మండాడి ఫస్ట్ డే ఎంత వసూళ్లు రాబట్టిందంటే!


 తల్లి మరణం తర్వాత భగవంతుని అన్వేషణలో ఇల్లు వదిలి వెళ్లి, ఉత్తర భారతదేశమంతటా ఆధ్యాత్మిక ప్రయాణం సాగించి, చివరకు 'నీం కరోలీ బాబా'గా పరివర్తన చెందిన లక్ష్మీ నారాయణ శర్మ అనే చిన్ననాటి బాలుడి నిజ జీవిత కథే హనుమాన్ అంశ్   "అందరినీ ప్రేమించు, అందరికీ అన్నదానం చేయి, ఎల్లప్పుడూ రామ్ రామ్ స్మరించు" అనేదే బాబా తత్వం. కేవలం 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ఇప్పుడు 200 కోట్ల మార్కుకి కూతవేటు దూరంలో ఉంది. అది కూడా మౌత్ టాక్. దీన్ని బట్టి అర్ధమవుతుంది ఏంటంటే ఎన్ని పబ్లిసిటీ జిమ్మిక్కులు చేసినా కంటెంట్ నే అన్నిటికంటే బలమని. 
ఎందుకంటే ప్రేక్షకులు, సినిమా మనకంటే ఎప్పుడు అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటారు.

 

 

[Trivikram ,Hanuman Ansh Movie, Telugu Release, Telugu Cinema  News, TeluguNews, Tollywood, Tollywood News, TeluguCinema]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com