
కామెడీ నటుల స్థాయి నుంచి హీరోలుగా ట్రాన్స్ ఫామ్ అయిన సూరి, సుహాస్ నిన్న ‘మండాడి' తో తెలుగు, తమిళంతో పాటు మొత్తం ఐదు భాషల్లో ల్యాండ్ అయ్యారు. అనూహ్యంగా అన్ని భాషల్లోనూ హెవీ క్రౌడ్ ని తెచ్చుకొని సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పింది. అదే సమయంలో కంటెంట్ బలంగా ఉండటంతో పాజిటివ్ టాక్ తో షికారు చేస్తుండటం శుభసూచికం.
దీంతో ట్రేడ్ అంచనాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 6.55 కోట్ల గ్రాస్ వసూళ్లని రాబట్టినట్టుగా తెలుస్తుంది. మాతృభాష తమిళంలో 3.90 కోట్ల నెట్ కలెక్షన్లు రాగా, 35.0% ఆక్యుపెన్సీ నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ మేకర్స్ వంటి ప్రముఖ సంస్థ విడుదల చేయగా, తెలుగు వెర్షన్ మొదటి రోజే 85 లక్షల నెట్ వసూళ్లను సాధించింది. థియేటర్ ఆక్యుపెన్సీ పరంగా హైదరాబాద్‌లో 22.3%, వైజాగ్-విశాఖపట్నంలో 33.0%, విజయవాడలో 22.5% ఆక్యుపెన్సీ రికార్డయింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ చిత్రం తన ప్రభావాన్ని చూపుతూ తొలిరోజే 1.00 కోటి గ్రాస్ వసూలు చేయడం విశేషం.

Also Read: సర్దార్ 2 : ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. హిట్ కొట్టినట్టేనా!
నిన్న మొత్తం థియేటర్ ఆక్యుపెన్సీ సగటున 32.6%గా నమోదైంది. రాత్రి కాంప్లిమెంటరీ షోలకు ఏకంగా 55.69% వరకు ఆక్యుపెన్సీ పెరగడం సినిమాకి ఉన్న పాజిటివ్ టాక్‌కు నిదర్శనం. శనివారానికి గానూ దాదాపు 1.74 కోట్ల మేర ముందస్తు అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు కావడంతో, ఈ వారాంతంలో ‘మండాడి’ బాక్సాఫీస్ కలెక్షన్ల రేంజ్ మరింత భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అద్భుతమైన కథనం, గ్రాండ్ మేకింగ్, మరియు నటీనటుల పవర్‌ఫుల్ నటన వల్ల ఈ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ లాంగ్ రన్‌లో మైలురాయి కలెక్షన్లను సాధించే దిశగా పయనిస్తోంది. మాథిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఆర్ఎస్ ఇన్‌ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్‌రెడ్ కుమార్, వెట్రీమారన్ నిర్మించాడు. బాయ్‌మర పడగుల పోటీ నేపథ్యంలో అత్యంత ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సూరి, సుహాస్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మహిమా నంబియార్, సత్యరాజ్ వంటి నటీనటుల కీలక పాత్రలు చిత్రానికి మరింత బలాన్ని చేకూరిస్తున్నాయని టాక్.
[Mandaadi, Suri, Suhaas, First Day Collections, Telugu Cinema News, TeluguNews, Tollywood, Tollywood News, TeluguCinema]






