
'ఎందరిని ఏ దరికి చేర్చినా, సంద్రాన ఒంటరిగా మిగలదా నావ' అని ఒక రైటర్ రాసినట్టుగా ఉంది టాక్సిక్ ఓటిటి డేట్ పరిస్థితి. అరే ఓటిటిలో వస్తే ఎందుకు డిజాస్టర్ అయ్యిందో, ఏ ఏ లోపాలు పర్ఫెక్ట్ గా కుదిరాయో చూద్దాం అని అభిమానులు ఆశించేకొద్దీ o డేట్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. పోనీ లేటుగా అయినా పర్ఫెక్ట్ డేట్ వస్తుందా అంటే అది లేదు.
సాధారణంగా ఏదైనా పెద్ద సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు నుండి ఆరు వారాల వ్యవధిలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రావడం పరిపాటి. ఆ లెక్కన చూస్తే, 'టాక్సిక్' చిత్రం సెప్టెంబర్ 25వ తేదీ నాటికి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) లో విడుదలవుతుందని సోషల్ మీడియాలోనూ, పలు సినీ విశ్లేషణల్లోనూ ప్రచారం జరిగింది. కానీ తీరా సెప్టెంబర్ చివరి వారం పూర్తయినా అందుబాటులోకి రాకపోవడంతో అభిమానులు ముఖ్యంగా ఓటిటి ప్రేమికులు తీవ్ర నిరాశకి గురవుతున్నారు. తాజాగా ఆడియన్స్‌కు మరో ఊహించని షాక్ తగిలింది. జీ5 సంస్థ అధికారికంగా విడుదల చేసిన అక్టోబర్ నెల ఓటీటీ రిలీజ్ క్యాలెండర్, స్ట్రీమింగ్ స్లేట్‌లో 'టాక్సిక్' చిత్రం పేరు ఎక్కడా కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇది కూడా చదవండి: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అంటే ఇదే: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్
.webp)
దీంతో అక్టోబర్ నెలలో కూడాస్ట్రీమింగ్ అయ్యే సూచనలు కనిపించడం లేదని స్పష్టమవుతోంది. మేకర్స్ నుంచి లేదా డిజిటల్ ప్లాట్‌ఫామ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో ఈ సస్పెన్స్ మరింత పెరిగింది. ఈ అనూహ్య ఆలస్యానికి ప్రధాన కారణం సినిమా బిజినెస్ రీ నెగోషియేషన్లు అయివుండవచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. థియేట్రికల్ రన్‌కు ముందు కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారంగా బాక్సాఫీస్ వద్ద సినిమా వసూళ్లు సాధించలేకపోతే, ఓటీటీ డిజిటల్ హక్కుల ధరలలో కోత విధించడం లేదా స్ట్రీమింగ్ విండో వ్యవధిని మార్చడంపై ప్రొడ్యూసర్లకు, ఓటీటీ సంస్థలకు మధ్య చర్చలు జరగడం సాధారణమే. అంతేకాకుండా, ఓటీటీ వెర్షన్ కోసం ప్రత్యేకంగా ఆల్టర్నేట్ కట్ తయారుచేస్తున్నారనే ప్రచారం సైతం జరుగుతోంది. ఏది ఏమైనా ఫ్యాన్స్ , ఓటిటి ప్రేమికులు దిగులుపడవద్దని ఒక రోజు మాత్రం టాక్సిక్ 'రాక' కన్ఫార్మ్ అని తెలుసుకుపోవాలి. సినీ ధర్మం కూడా.
[Toxic Ott Release Date Delayed Again,Toxic, yash, Kaira Adwani, Zee5 Toxic, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tolywood News]





.webp)
