.webp)
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది! మాటలు సైతం మురిసిపోవు. ఎస్, ఎన్టీఆర్ మాట్లాడుతుంటే మాటలు సైతం మురిసిపోతాయని బుల్లి సినీ ప్రేమికుడ్ని అడిగినా చెప్తాడు. అచ్చులు, హల్లులుగా పుట్టినందుకు అక్షరాలు సైతం మురిసిపోవడంలో పోటీ పడుతుంటాయి. నిన్న జరిగిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ఈవెంట్ లోను మరోసారి అదే జరిగింది. మరి ఆ మాటలేంటో చూద్దాం.
‘ఎన్టీఆర్ మాట్లాడుతు 'కోవిడ్ అనే టఫ్ సమయంలో ఒక టాలెంట్ నెమ్మదిగా మనలోకి వచ్చింది. అదే ఫాహద్ సార్. మొదటిసారి బెంగళూరులో ఆయన సినిమా చూశా. నాకు అతి తక్కువ మంది యాక్టర్స్ ఇష్టం. అందులో మొదటి వ్యక్తి ఫాహద్ ఫాజిల్. దేశం గర్వించదగ్గ నటుడు ఫాహద్. ఆయన తెలుగులో మొదటిసారి లీడ్ యాక్టర్ గా చేస్తున్న ఫాహద్ గారికి మంచి విజయం దక్కుతుందని నమ్ముతున్నా. దర్శకుడిగా శశాంక్ మొదటి సినిమా ఈ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఈ సినిమా ఆయనకు గొప్ప విజయం అందించాలని కోరుకుంటున్నా. కార్తికేయ ఈ రోజు నిర్మాతగా ఇక్కడ నిలబడటం చాలా సంతోషంగా ఉంది. మా జక్కన్న చేసే ప్రతి ప్రయత్నంలో కార్తికేయ ఉన్నాడు. ఆర్ఆర్ ఆర్,బాహుబలి సినిమాల వెనుక మా తమ్ముడు కార్తికేయనే ఉన్నాడు. కార్తికేయ కెరీర్ లో ఈ సినిమా గొప్ప చిత్రంగా నిలవాలని కోరుకుంటున్నా.
ఇది కూడా చదవండి: సంచలన వార్త: కుప్పకూలిన ఇరుముడి మూవీ బ్రిడ్జ్

గాయం నుంచి కోలుకున్నా. డ్రాగన్ చెప్పిన సమయానికే విడుదల అవుతుంది అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఈవెంట్ లో అభిమానుల గుండెచప్పుడు మాత్రం ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో జర లేటు చెయ్యకుండా పాన్ ఇండియా మూవీ రావాలని. 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అక్టోబర్ 2న రిలీజ్ అవుతుండగా ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్ల మీద శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మించారు. శశాంక్ ఏలేటి దర్శకుడు. అక్టోబర్ 2 రిలీజ్ డేట్.
[Ntr Speech In Dont Trouble The Trouble, Ntr latest Speech, Dont Trouble The Trouble Cast, Ntr, Rajamouli, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tolywood News]






