
ఎంత పెద్ద స్టార్ అయినా కథ, కథనం బాగోకపోతే ప్లాప్ ని కౌగిలించుకోవాల్సిందే అని టాక్సిక్ మరోసారి నిరూపించింది. అభిమానులు, సినీ ప్రేమికుల జనాభా కంటే ప్రేక్షకుల జనాభా ముఖ్యమనే సత్యం కూడా టాక్సిక్ ద్వారా మరోసారి నిరూపితమైందని చెప్పుకోవచ్చు.
నిన్నటాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ ఎంపిక చేసిన నగరాల్లో రిలీజయ్యింది. దాదాపు 17 నిమిషాల మేర నిడివి తగ్గించి, 2 గంటల 57 నిమిషాలతో మేకర్స్ రిలీజ్ చేసారు. అయితే, మేకర్స్ ఆశించిన ఊరట ఈ ఇంగ్లీష్ వెర్షన్ ద్వారా కూడా లభించలేదు. తొలిరోజు ట్రేడ్ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా కేవలం 450 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీనివల్ల మొదటి రోజు వెర్షన్ సాధించిన వసూళ్లు కేవలం 1.40 లక్షలకే పరిమితమై ట్రేడ్ వర్గాలకి షాక్‌కి గురిచేసింది. ముఖ్యంగా ఉత్తరాది నగరాలైన గురుగ్రామ్, నోయిడాలలో అయితే ఒక్కో నగరంలో 25 కంటే తక్కువ టికెట్లు మాత్రమే తెగి, దారుణమైన ఆక్యుపెన్సీని నమోదు చేశాయి. ముంబై, బెంగళూరులో కొద్దిగా పరవాలేదనిపించినా, ఓవరాల్ డిమాండ్ మాత్రం చాలా నీరసంగా ఉంది.
.webp)
Also Read: డెబ్యూ దర్శకులకి ఏమైంది: ఓల్డ్ స్టైల్ నారేషన్ తో ఎందుకు వస్తున్నారు!
దీంతో టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ ఒక రేంజ్ లో ఇరగదీస్తుందని యష్ ఫ్యాన్స్ కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. కానీ భాష మారవచ్చేమో గాని భావం, భావోద్వేగం మాత్రం ఒక్కటే కదా.
[Toxic, English Version Collections, Yash, Geetu Mohandas, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]






