
ఇండస్ట్రీలో దర్శకుడిగా మొదటి ఛాన్స్ రావాలంటే చాలా కష్టం. కానీ వచ్చాక దర్శకుడిగా నిరూపించుకుంటే మాత్రం ఇక ఇండస్ట్రీలో తిరుగుండదు. మినిమమ్ పది నిర్మాతల అడ్వాన్స్ లు ఆ దర్శకుడి దగ్గరకి చేరతాయి.ప్రేక్షకులు కూడా సదరు దర్శకుడి నుంచి సినిమా వస్తుందంటే చాలు థియేటర్స్ కి క్యూ కడతారు.
కానీ ఇప్పుడు వస్తున్న కొత్త దర్శకులు అవుట్ డేటెడ్ కంటెంట్ తో సినిమా తెరకెక్కిస్తు ప్రేక్షకులని ఇబ్బంది పెట్టడమే కాకుండా తమ కెరీర్ ని కూడా ఇబ్బందుల్లోకి తీసుకెళ్తున్నారు. ఒక కథని ఎంచుకునేటప్పుడు ఆ కథ ఎలాంటి మోడ్ లో ఉంది, ప్రస్తుత జనరేషన్ కి నచ్చుతుందా? ఒక వేళ పాత తరహా కంటెంట్ అయినా ఎలాంటి సీన్స్ , స్క్రీన్ ప్లే, బాడీ లాంగ్వేజ్, లొకేషన్స్ తో ప్రెజెంటేషన్ ఇవ్వాలనే కనీస అవగాహన కూడా లేకుండా పోయింది. అందుకే చాలా వరకు కథలు సెల్యులాయిడ్ పైకి వచ్చాక ఫెయిల్ అవుతున్నాయి.
Also Read: RC17 వైరల్ న్యూస్: రామ్ చరణ్, సుకుమార్ కోసం హాలీవుడ్ డిజైనర్!
.webp)
కొంత మంది సినీ విశ్లేషకులు,అభిమానులలో వినిపిస్తున్న మాట కూడా ఏంటంటే ఇప్పుడొస్తున్న చాలా మంది దర్శకులు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా తామే రాసుకోవడం వలన మంచి కంటెంట్ రాలేకపోతుందేమో, ఒక వేళ ఆ అర్హతలు అన్ని దర్శకుడికి ఉన్నా కూడా నిమిష, నిమిషానికి మారుతున్న వరల్డ్ మూడ్ ని గమనిస్తూ అనుభవమున్న రచయితలతో డిస్కర్స్ చేయాలనీ వాళ్లంతా కోరుతున్నారు.
[Telugu Cinema, Director, Content, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]






