Home

»

Latest News

1350 కోట్లు హుష్ కాకి: టామ్ క్రూజ్ ‘డిగ్గర్’ మూవీ డిజాస్టర్ ఫలితం!

Oct 8, 2026 12:48PM


హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ అంటే తెలియని వరల్డ్ సినీ ప్రేమికుడు ఉండడు. బొమ్మ పడితే బాక్స్ బద్దలవ్వాల్సిందే. దీంతో  వందల మిలియన్ డాలర్ల కలెక్షన్ల సలాం కొడతాయి. కానీ ఇటీవల విడుదలైన తాజా చిత్రం ‘డిగ్గర్’ (Digger) మాత్రం బాక్సాఫీస్ చరిత్రలోనే అనూహ్యమైన అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచి అందరినీ షాక్   కి  గురిచేసింది.


 ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు అలెజాండ్రో జి ఇనారిటు దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ భారీ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలమైంది. అత్యంత వీక్ స్టోరీ, నత్తనడకన సాగే నిరాశజనక కథనం, నీరసమైన డైరెక్షన్ కారణంగా ప్రేక్షకులు ఈ సినిమాను ముక్తకంఠంతో తిరస్కరించారు.ఈ సినిమా నిర్మాణ లెక్కలు చూస్తే ఎంతటి భారీ రిస్క్ తీసుకున్నారో స్పష్టమవుతుంది. హాలీవుడ్ వర్గాల అంచనా ప్రకారం, డిగ్గర్ సినిమా నిర్మాణం కోసమే నిర్మాతలు దాదాపు $140 మిలియన్ల నుండి $180 మిలియన్ల వరకు భారీగా ఖర్చు చేశారు. ఇక అంతర్జాతీయంగా ఈ సినిమాను ప్రమోషన్స్ మరియు మార్కెటింగ్ చేయడానికి మేకర్స్ మరొక $100 మిలియన్ల వరకు ధారాదత్తం చేశారు. అంటే ప్రమోషన్లతో కలిపి ఈ సినిమా మొత్తం బడ్జెట్ సుమారు $225 మిలియన్ల నుండి $280 మిలియన్ల మార్కును తాకింది. కానీ, ఇంతటి భారీ వ్యయంతో ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ ప్రారంభంలో గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు మాత్రం ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేసాయి.

ఇది కూడా చదవండి: Nana Patekar: నానా పటేకర్ తొలిప్రేమ వెనుక ఉన్న కన్నీటి కథ!


ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ సినిమా సాధించిన మొత్తం వసూళ్లు కేవలం $20 మిలియన్లు మాత్రమే కావడం గమనార్హం. హాలీవుడ్ సినిమాలకు అత్యంత కీలకమైన, అతిపెద్ద మార్కెట్ అయిన నార్త్ అమెరికాలో ఈ సినిమా కేవలం $8 మిలియన్ల ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టగలిగింది. గ్లోబల్ మార్కెట్‌లో ఇతర దేశాలన్నింటిలో కలిపి కేవలం $12 మిలియన్ల వసూళ్లు మాత్రమే నమోదయ్యాయి. భారతీయ బాక్సాఫీస్ విషయానికి వస్తే, ఇండియాలో కూడా టామ్ క్రూజ్ కెరీర్‌లోనే ఎన్నడూ లేనంత నీరసమైన స్పందన లభించింది. తొలి రోజు ₹80 లక్షలు, రెండో రోజు ₹50 లక్షలు, మూడో రోజు ₹50 లక్షలు మరియు నాలుగో రోజు కేవలం ₹20 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసి, మొదటి నాలుగు రోజుల్లో కలిపి రూ. 2 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే దక్కించుకుని వాష్ అవుట్ దిశగా చేరింది.

 

 

ప్రస్తుత బాక్సాఫీస్ ట్రెండ్స్ ప్రకారం ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రోస్‌కు డిగ్గర్ సినిమా రూపంలో దాదాపు $145 మిలియన్ల నుండి $150 మిలియన్లకు పైగా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియన్ కరెన్సీలో లెక్కేస్తే ఇది 1350 కోట్లకు పైగానే నష్టమని సినీ ట్రేడ్ సర్కిల్స్  అంచనా వేస్తున్నారు. గడిచిన 20 ఏళ్ల టామ్ క్రూజ్ సినీ కెరీర్‌లోనే అత్యంత ఘోరమైన డిజాస్టర్ ఓపెనింగ్‌గా డిగ్గర్ నిలిచింది.

 

[Tom Cruise Digger Box Office Disaster Losses, Tom Cruise Digger, Digger Box Office Disaster, Warner Bros Massive Loss, Telugu Cinema News, Telugu Cinema, Tollywood News, Tollywood]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com