
తొలిప్రేమ.. సక్సెస్ అయితే సంతోషం. లేదంటే జీవితాంతం ఆ బాధ వెంటాడుతోందనే మాటలు తొలి ప్రేమని అనుభవంచిన వాళ్ళ నుంచి వినిపించే మాటలు. ఈ క్రమంలోనే తొలిప్రేమ గురించి నానా పటేకర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న భావోద్వేగపూరితమైన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒక షోలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్.. నానా పటేకర్‌ను ఉద్దేశించి ఆయన యుక్తవయసులో ఉన్నప్పుడు ఆయన "తొలి ప్రేమ" ఎవరని చాలా ఉత్సాహంగా ప్రశ్నించారు. సాధారణంగా సినీ తారలను ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఏదో ఒక హీరోయిన్ పేరో లేక పాఠశాల రోజుల్లోని ప్రేమికురాలి పేరో చెబుతుంటారు. కానీ, నానా పటేకర్ ఇచ్చిన సమాధానం మాత్రం అనిల్ కపూర్‌తో పాటు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఏ అమ్మాయి పేరో చెప్పకుండా, తన టీనేజ్ వయసులో తనకు ఉన్న ఏకైక తొలి ప్రేమ "రొట్టె (ఆహారం)" మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. వినడానికి ఇది కాస్త నవ్వు తెప్పించేలా అనిపించినా, ఆ మాట వెనుక ఆయన అనుభవించిన తీవ్రమైన దారిద్య్రం, ఆకలి మంటల భయంకరమైన నిజం దాగి ఉంది. నానా పటేకర్ బాల్యం, కౌమారదశ అంతా దారుణమైన ఆర్థిక ఇబ్బందులతోనే గడిచాయి. రోజుకు కేవలం ఒక్క పూట భోజనంతో కడుపు మార్చుకుని గడిపిన రోజులు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. చేతిలో ఒక్క రూపాయి కూడా లేక, గమ్యస్థానాలకు చేరుకోవడానికి కిలోమీటర్ల కొద్దీ కాలినడకన నడిచిన చేదు అనుభవాలను ఆయన ఎప్పటికీ మరచిపోలేకపోయారు. ఆకలి బాధ, సమాజంలో ఎదురైన అవమానాలు ఆయన మనస్సుపై చెరగని ముద్ర వేశాయి. అందుకే టీనేజ్ వయసులో ఆకర్షణలు, ప్రేమల కంటే కడుపు నిండా ఒక్క రొట్టె దొరకడమే తన జీవితంలో అతిపెద్ద కలగా, ప్రేమగా ఉండేదని నానా ఆవేదనగా చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: రామాయణ నిర్మాతపై దాడి: ఇది ఖచ్చితంగా ఆ సంస్థ పనే!
.webp)
అంతేకాకుండా, తన జీవితంలో ప్రేమగా అడుగుపెట్టిన ఏకైక అమ్మాయి తన భార్య మాత్రమేనని, పెళ్లికి ముందు తన జీవితంలో ఎలాంటి ప్రేమకథలు లేవని ఆయన చాలా నిజాయితీగా వెల్లడించారు. కష్టాల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టే ఆయన జీవితాంతం హంగులు, ఆర్భాటాలకు దూరంగా సాధారణ జీవనం గడిపారు. ఈ విషాదకరమైన కథ నానా పటేకర్ పట్ల అభిమానుల్లో ఉన్న గౌరవాన్ని మరింత రెట్టింపు చేస్తోంది.
[Nana Patekar First Love secret story, Nana Patekar First Love, Nana Patekar Anil Kapoor Interview, Nana Patekar Struggle Story, Telugu Cinema News, Telugu Cinema, Tollywood News, Tollywood]





