Home

»

Latest News

ఈ వారం 7 సినిమాలు: ‘ఆదర్శ కుటుంబం’ వాయిదాతో ఆ మూవీపైనే ఆశలు.!

Oct 8, 2026 7:05PM

టాలీవుడ్‌లో గత కొన్ని వారాలుగా థియేటర్ల దగ్గర సరైన సందడి కనిపించడం లేదు. ముఖ్యంగా గత వారం ఏకంగా పదకొండు సినిమాలు విడుదలైనా.. చెప్పుకోదగ్గ కమర్షియల్ సక్సెస్ ఏదీ దక్కలేదు. దీంతో ఈ వారం వచ్చే సినిమాలపై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ అందరూ ఆశలు పెట్టుకున్న ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా పడటంతో సీన్ మొత్తం మారిపోయింది.

ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు మొత్తం ఏడు సినిమాలు రానున్నాయి. వీటిలో ఐదు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాగా.. రెండు డబ్బింగ్ సినిమాలు. అయితే వీటిలో కాస్త ఎక్కువ అంచనాలు ఉన్న సినిమా మాత్రం శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’.

శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న థియేటర్లలోకి వస్తోంది. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాధిక, షైన్ టామ్ చాకో, సత్య, ఉపేంద్ర లిమాయే తదితరులు కీలక పాత్రలు పోషించారు. నక్సలైట్ బ్యాక్‌డ్రాప్ అయినప్పటికీ ఇది కామెడీ సినిమాగా రూపొందటం విశేషం.

ఈ వారం వస్తున్న మరో సినిమా ‘బా.. బా.. బ్లాక్ షీప్’. మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన ఈ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీలో ఉపేంద్ర లిమాయే, టీనూ ఆనంద్, రాజా రవీంద్ర, అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్ తదితరులు నటించారు. గుణి మంచికంటి దర్శకత్వం వహించారు.

‘మయూఖ’ కూడా అక్టోబర్ 9నే వస్తోంది. పాయల్ చెంగప్ప ప్రధాన పాత్ర పోషించిన ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌కు శ్రీతేజ్ ఎస్.కె. దర్శకత్వం వహించారు. బిగ్‌బాస్ ఫేమ్ అమన్ మసూద్, దేవ్ డి, మురళీధర్ గౌడ్ తదితరులు నటించారు.

ఇక ‘చకోర’ ఒక మ్యూజికల్ లవ్ స్టోరీగా వస్తోంది. శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా నటించిన ఈ సినిమాకు మంగా శ్రీనివాస్ దర్శకుడు.

‘గుడ్ టైమ్’ కూడా ఈ వీకెండ్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నిఖిల్ గాజుల, అన్యుక్త నలాని, హృతిక్ శెట్టి, ధనరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను చాణక్య జిల్లా తెరకెక్కించారు.

ఈ ఐదు స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో పాటు రెండు డబ్బింగ్ సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి.

తమిళంలో ఇప్పటికే విడుదలైన ‘సప్త సాగరాలు సప్త గిరులు’ ఒక వారం ఆలస్యంగా తెలుగులోకి వస్తోంది. మరోవైపు హిందీలో మంచి విజయాన్ని అందుకున్న ‘హనుమాన్ అంశ్’ను తెలుగులో విడుదల చేస్తున్నారు.

మరి ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి: అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఒకే స్ట్రాటజీ.. ఇద్దరూ అదే పని చేస్తున్నారు.!

 

 

 

[This Week Releases Telugu, Comrade Kalyan, Hanuman Ansh, Saptha Sagaralu Saptha Girulu, Mayookha, Baa Baa Black Sheep, Chakora, Good Time, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com