
'టాక్సీవాలా' తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘రణబాలి’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను పెంచేసింది.
1870ల నాటి రాయలసీమను, కరువు-ఆకలి-బ్రిటిష్ దోపిడీని నేపథ్యంగా తీసుకుని ఒక భారీ యాక్షన్ డ్రామాను చూపించబోతున్నారు.
సింగనమల కొండపై ఉన్న భద్ర మల్లన్న స్వామి గురించి చెబుతూ బుర్రకథతో ట్రైలర్ ను ప్రారంభించిన తీరు ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆకలితో అల్లాడుతున్న ప్రజలు, కరువుతో కుంగిపోయిన ప్రాంతం, మరోవైపు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీ చేసే బ్రిటిష్ పాలకులను చూపిస్తూ కథలో ఉన్న ఎమోషన్ ను చూపించారు.
ఆ తర్వాత రణబాలిగా విజయ్ దేవరకొండ ఎంట్రీ, జయమ్మ(రష్మిక)తో పెళ్లి వంటి సన్నివేశాలు కూడా మెప్పించాయి. అయితే బ్రిటిష్ వారిపై రణబాలి తిరగబడిన సీన్స్ మాత్రం గూస్ బంప్స్. రౌద్ర రూపంలో విజయ్ విరుచుకుపడ్డాడు అని చెప్పొచ్చు. ముఖ్యంగా లాస్ట్ షాట్ మాత్రం హైలైట్. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి.
మొత్తానికి ‘రణబాలి’ ట్రైలర్ మెప్పించింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ కొత్త అవతారం.. 1870ల రాయలసీమ నేపథ్యం.. ఆకలి, దోపిడీ నుంచి పుట్టిన తిరుగుబాటు.. బాగా వర్కవుట్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: ఈ వారం 7 సినిమాలు..‘ఆదర్శ కుటుంబం’ వాయిదాతో ఆ మూవీపైనే ఆశలు.!
[Ranabaali Trailer Review, Ranabaali Trailer, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Telugu Movies 2026, Telugu Film News]






