Home

»

Latest News

ఇక మాట్లాడుకోవడాలు లేవ్..ఈ వారం ఓటీటీలో 22 సినిమాల పండుగ

Aug 10, 2026 12:18PM

 

సినీ కిక్ కోసం పరితపించే సినీ ప్రేమికులకి గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అంటే కంటే మీ భాషలో చెప్పాలంటే కిక్ ప్రాప్తిరస్తు. దీంతో ఎనలేని ఆనందంతో మీ ఆయుక్షు కూడా పెరగనుంది. అగస్టు 10 నుండి ఆగస్టు 17 వరకు వివిధ దిగ్గజ ఓటీటీ సంస్థలైన నెట్‌ఫ్లిక్స్, జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ వంటి వేదికలలో ఏకంగా 22 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌కి  వస్తున్నాయి. 


 ఈ వారం ప్రత్యేకత ఏమిటంటే, మొత్తం 22 కొత్త రిలీజెస్ అందుబాటులోకి రానుండటమే కాకుండా, అందులో ఒక్క రోజే ఏకంగా 7 సినిమాలు ఒకేసారి డిజిటల్ ప్రీమియర్ కాబోతున్నాయి. ఇది ఓటీటీ చరిత్రలోనే అతిపెద్ద సింగిల్-డే రికార్డ్ విడుదలలో ఒకటిగా నిలుస్తుంది. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్స్, క్రైమ్ డ్రామా, రొమాంటిక్ కామెడీ, మరియు వార్ డ్రామా వంటి వైవిధ్యమైన కథాంశాలతో రూపొందిన సినిమాలు మిమ్మల్ని    అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఏయే ఓటీటీల్లో ఏయే మూవీస్/ వెబ్ సిరీస్ 

 

ఓటీటీమూవీస్ / వెబ్ సిరీస్
నెట్ ఫ్లిక్స్ (Netflix)    మిడ్ వింటర్ బ్రేక్ (ఇంగ్లిష్ మూవీ - ఆగస్ట్ 10), మారిన్హో (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ - ఆగస్ట్ 11), రోరీ స్కోవెల్ (ఆగస్ట్ 11), ఏ చైల్డ్ ఆఫ్ మై వోన్ (ఇంగ్లిష్ మూవీ - ఆగస్ట్ 13), నాండో బిట్వీన్ టూ వరల్డ్స్ (వెబ్ సిరీస్ - ఆగస్ట్ 12), డోంట్ సే గుడ్ లక్ (ఇంగ్లీష్ మూవీ - మే 13), కాక్ టెయిల్ 2 (హిందీ మూవీ - ఆగస్ట్ 14), మె బ్రిలియంట్ కెరీర్ (ఇంగ్లీష్ సిరీస్ - ఆగస్ట్ 13), ఉమెత్తో (ఆఫ్రికన్ సిరీస్ - ఆగస్ట్ 14), మై బెస్ట్ ఫ్రెండ్ (ఆగస్ట్ 14)


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)    

ద ట్రెయిటర్స్ సీజన్ 2 (హిందీ రియాలిటీ షో - ఆగస్ట్ 13),జీ5 (ZEE5)    భారత భాగ్య విధాత (హిందీ మూవీ - ఆగస్ట్ 14), నిబ్బా నిబ్బీ (మరాఠీ మూవీ - ఆగస్ట్ 14), జియో హాట్ స్టార్ (Jio Hotstar)    హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్ - ఆగస్ట్ 10), 108 బేస్ హాస్పిటల్ (హిందీ సిరీస్ - ఆగస్ట్ 15)

సన్ నెక్స్ట్ (Sunnxt)    మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ (తెలుగు మూవీ - ఆగస్ట్ 14)
ఆహా (Aha)    చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె - USA (తెలుగు కుకింగ్ షో - ఆగస్ట్ 13)
సోనీ లివ్ (Sonyliv)    కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 18 (ఆగస్ట్ 10)
మనోరమ మ్యాక్స్ (Manorama Max)    కాటాలన్ (మలయాళ మూవీ - ఆగస్ట్ 13)
లయన్స్ గేట్ ప్లే (Lions Gateplay)    ఆఖరి సవాల్ (హిందీ మూవీ - ఆగస్ట్ 14)
ఆపిల్ టీవీ ప్లస్ (Apple TV Plus)    ఉమెన్ ఇన్ బ్లూ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్ - ఆగస్ట్ 12)

Also read: ఒకే కారులో రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఏపి 40 LE 1 ల్యాండ్ క్రూయిజర్ ఎవరిదో తెలుసా?

ఈ విధంగా ఓటిటి సినిమా మీ ఆనందం కోసం ముస్తాబు అవుతుంది.  

Ott, Tollywood, Bollywood

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com