
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)..నాచురల్ స్టార్ నాని(Nani).. ఈ ఇద్దరి పేర్లు పక్కన పక్కన వింటేనే ఇద్దరి అభిమానులకి, సినీ అభిమానులకి ఒక రకమైన పులకింత. ఇప్పుడు ఈ ఇద్దరికి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. రైటర్ నుంచి డైరెక్టర్ గా మారి హిట్ ని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు వెంకీ అట్లూరి. 'తొలిప్రేమ', 'సార్' 'లక్కీ భాస్కర్ వంటి వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించాడు. లక్కీ భాస్కర్ అయితే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో 'ఉత్తమ డైలాగ్' విభాగంలో నేషనల్ అవార్డుని గెలుచుకుంది. దీంతో ఈ నెల 14 న రాబోతున్న స్టార్ హీరో సూర్య, మమితా బైజూ ల 'విశ్వనాథ్ అండ్ సన్స్' పై భారీ అంచనాలు ఉన్నాయి.
రీసెంట్ గా వెంకీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'రెండేళ్ల వ్యవధిలో ధనుష్‌తో చేయబోయే మూవీతో పాటు పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించే చిల్డ్రన్ ఫిలిం పూర్తి చెయ్యాలి. ఇవే కాకుండా భవిష్యత్తులో హిందీ, పంజాబీ భాషల్లో కూడా సినిమాలు చేయాలనే ఆలోచన ఉంది.కథల ఎంపిక, స్క్రిప్ట్ రచన కోసం రోజుకి దాదాపు 12 నుంచి 13 గంటల పాటు శ్రమిస్తూ, ఒక పూర్తిస్థాయి స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి కనీసం 4 నెలల సమయం తీసుకుంటాను. ఇటీవల 8 నెలల సుదీర్ఘ వ్యవధిలో రెండు పూర్తి స్క్రిప్ట్‌లను పూర్తి చేసినట్లు చేశాను. అలాగే ప్రతి సినిమాలోనూ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే నానితో కలిసి పనిచేయాలనే బలమైన కోరిక ఉంది. అలాగే మెగాస్టార్ చిరంజీవితో చేయాలనీ జీవిత లక్ష్యం అని చెప్పుకొచ్చాడు.
Also read: ఇక మాట్లాడుకోవడాలు లేవ్..ఈ వారం ఓటీటీలో 22 సినిమాల పండుగ
Chiranjeevi, Nani, Suriya, Venki Atluri
.webp)






