Home

»

Latest News

నాని స్టార్ పవర్: నెట్‌ఫ్లిక్స్‌ టాప్ ట్రెండింగ్‌లో ‘ది ప్యారడైజ్’.!

Oct 23, 2026 12:24PM

నేచురల్ స్టార్ నాని, కయాదు లోహర్ జంటగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సినిమా ‘ది ప్యారడైజ్’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా థియేటర్లలో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ఓటీటీలోకి వచ్చేసరికి సీన్ మారిపోయింది. టాక్ ఎలా ఉన్నా.. నాని స్టార్ పవర్ మాత్రం తగ్గలేదని ట్రెండింగ్‌లో సినిమా సాధిస్తున్న స్థానమే చెబుతోంది.

నాని సినిమాలకు ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘ది ప్యారడైజ్’కు అనూహ్య స్పందన లభిస్తోంది. విడుదలైన కొద్ది సమయంలోనే ఇండియా వైడ్‌గా టాప్ ట్రెండింగ్‌లోకి రావడం ఆసక్తికరంగా మారింది.

థియేటర్లలో సినిమాపై వచ్చిన చర్చలు, విమర్శలతో సంబంధం లేకుండా ఓటీటీలో ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా నాని నటన, శ్రీకాంత్ ఓదెల టేకింగ్‌పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి కూడా ఈ ట్రెండింగ్‌కు ఒక కారణంగా కనిపిస్తోంది.

మరి ఇండియా వైడ్‌గా నంబర్ వన్ ట్రెండింగ్‌లోకి వచ్చిన ‘ది ప్యారడైజ్’ ఇదే జోరును ఎన్ని రోజులు కొనసాగిస్తుంది? ఓటీటీలో ఈ సినిమా సాధించే ఆదరణ నాని మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: అక్క ట్రైలర్‌.. కీర్తి సురేశ్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా?.. మామూలు రచ్చ కాదు.!

 

 

 

[The Paradise Trending On Netflix, The Paradise OTT, The Paradise Netflix, Nani Paradise OTT, Nani Latest Movie, The Paradise, Natural Star Nani, Srikanth Odela, Kayadu Lohar, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com