Home

»

Latest News

అక్క ట్రైలర్‌: కీర్తి సురేశ్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా?.. మామూలు రచ్చ కాదు.!

Oct 23, 2026 12:00PM

కీర్తి సురేశ్‌ను ఇప్పటివరకు ఎక్కువగా సాఫ్ట్‌ పాత్రల్లోనే చూశాం. కానీ ‘అక్క’ వెబ్ సిరీస్‌లో ఆమె లుక్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. చేతిలో తుపాకీ.. కళ్లలో కసి.. తన సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఎంతకైనా తెగించే మహిళగా కీర్తి కనిపిస్తున్నారు. మరోవైపు రాధికా ఆప్టే కూడా పవర్‌ఫుల్ పాత్రలో ఎదురుపడటంతో ట్రైలర్‌పై ఆసక్తి పెరిగింది.

కీర్తి సురేశ్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన ‘అక్క’ ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. 1980ల నేపథ్యంలో, మహిళల ఆధిపత్యంలో నడిచే కల్పిత ప్రపంచం ‘పెర్నూరు’లో ఈ కథ సాగుతుంది. అక్కడి అధికార వ్యవస్థ, సంప్రదాయాలు, వారసత్వం చుట్టూ ఇద్దరు బలమైన మహిళల మధ్య ఏర్పడే పోరాటమే ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా కనిపిస్తోంది.

ఈ సిరీస్‌లో భవాని పాత్రలో కీర్తి సురేశ్ కనిపిస్తుండగా, రుద్ర పాత్రను రాధికా ఆప్టే పోషిస్తున్నారు. భవాని తన ఆధిపత్యాన్ని, తరతరాలుగా వస్తున్న వారసత్వాన్ని కాపాడుకోవాలని చూస్తుంది. అయితే బయటి నుంచి వచ్చే సవాలు ఆమె ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ఈ నేపథ్యంలో భవాని, రుద్ర మధ్య మొదలయ్యే ఆధిపత్య పోరు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

సాధారణ గ్యాంగ్‌స్టర్ కథలకు భిన్నంగా మహిళలే అధికార కేంద్రంగా ఉండే ప్రపంచాన్ని ఈ సిరీస్‌లో చూపించబోతున్నారు. అధికారం, కుటుంబం, విధేయత, ప్రతీకారం వంటి అంశాలు కథలో కీలకంగా కనిపిస్తున్నాయి. కీర్తి, రాధికా తొలిసారి కలిసి నటిస్తుండటం కూడా ఈ సిరీస్‌పై ఆసక్తిని పెంచుతోంది.

ధర్మరాజ్ శెట్టి రచన, దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను యశ్ రాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. తనదైన ప్రపంచం, బలమైన మహిళా పాత్రలతో గ్యాంగ్‌స్టర్ జానర్‌ను కొత్త కోణంలో చూపించేందుకు ఈ సిరీస్‌ను రూపొందించారు. తన పాత్రలోని బలం, అంతర్గత సంఘర్షణలు భవానిని ప్రత్యేకంగా నిలబెడతాయని కీర్తి సురేశ్ కూడా పేర్కొన్నారు.

‘అక్క’ అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్‌లోనే ఇద్దరి మధ్య పోరు తీవ్రంగా కనిపిస్తుండటంతో.. పూర్తి సిరీస్‌లో భవాని, రుద్రల మధ్య ఆధిపత్య పోరు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.

ఇది కూడా చదవండి: ప్రభాస్ బర్త్‌డే ట్రీట్.. ‘కల్కి 2’ స్పెషల్ వీడియో అదిరింది.!

 

 

 

[Keerthy Suresh Akka Trailer, Keerthy Suresh New Web Series, Keerthy Suresh VS Radhika Apte, Akka Trailer, Keerthy Suresh, Radhika Apte, Akka Netflix Series, Akka OTT Release Date, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com