Home

»

Latest News

ప్రీమియర్ షోలలో 'ది ప్యారడైజ్’రికార్డ్స్.. ఎన్నో తెలిస్తే మీరు షాక్

Sep 17, 2026 5:41PM

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'యేష నాగుల' సాంగ్స్ తో రికార్డు సృష్టిస్తూ బిజీగా ఉన్నాడు. అభిమానులు అయితే రిలీజ్ రోజు థియేటర్స్ లో 'నాని'లా స్టెప్స్ వేయాలనే ప్రీ ప్రిపరేషన్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ముందుకు ప్యారడైజ్ సంబంధించిన మరో రికార్డు వచ్చి చేరడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.


సెప్టెంబర్ 24న రిలీజ్ కాబోతున్న ప్యారడైజ్ ఒక్క రోజు ముందే అంటే సెప్టెంబర్ 23 రాత్రివేళ భారీ ఎత్తున గ్రాండ్ ప్రీమియర్ లతో వస్తున్న విషయం తెలిసిందే.కేవలం రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏకంగా 800లకి పైగా ప్రత్యేక ప్రీమియర్ షోలని ప్రదర్శించబోతుండటం టాలీవుడ్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డుగా నిలవనుంది. ఈ వార్తే నాని అభిమాలని హుషారు అనే వర్డ్ కి సరికొత్త పదాన్ని కనుక్కునే అన్వేషణలో పడేలా చేస్తుంది.ఇక సినిమా ప్రమోషన్ల కోసం చిత్రబృందం 'జడల జమానా షురూ' పేరుతో ఒక గ్రాండ్ ప్రీ-రిలీజ్ టూర్ షెడ్యూల్‌ను కూడా ప్రకటించి సోషల్ మీడియాని  ఊపేస్తోంది.

 

 

Also Read: బ్రెయిన్ స్ట్రోక్‌పై పోరాటం చేస్తున్న 'గబ్బర్ సింగ్’రమేశ్: బెడ్ పై ఏ హీరో సాంగ్స్ చూస్తున్నాడో తెలుసా!

 విడుదలకు ముందే దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నై, బెంగళూరు, కొచ్చి, మరియు హైదరాబాద్‌లలో నేచురల్ స్టార్ నాని స్వయంగా పర్యటిస్తూ ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొని అభిమానులని నేరుగా కలవనున్నారు. ఇప్పటికే విదేశీ మార్కెట్లలో ముఖ్యంగా ఉత్తర అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ శరవేగంగా ప్రారంభమై, స్వల్ప వ్యవధిలోనే $150K మార్కును దాటేసి కొత్త రికార్డులను నమోదు చేస్తోంది.  శ్రీకాంత్ ఓదేల మార్క్ రగ్గడ్ ఇంటెన్సిటీతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నాని 'జడల్' అనే అత్యంత విభిన్నమైన, పవర్‌ఫుల్ మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా రాఘవ్ జుయల్, కయాదు లోహర్అ కీ రోల్స్. అనిరుద్  రవిచందర్ మ్యూజిక్. 'A' సర్టిఫికేట్ రావడమే కొంచం ఇబ్బంది. నాని ప్రవాహం  ముందు ఆ సర్టిఫికెట్ ప్రభావం ఉండకపోవచ్చని టాక్. 

 

 

 

The Paradise, he Paradise Record Premieres, Nani, kayadu lohar, Jadal Zamana,Tollywood Movies Postponed, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com