Home

»

Latest News

బ్రెయిన్ స్ట్రోక్‌పై గబ్బర్ సింగ్ రమేశ్ పోరాటం:బెడ్ పై ఏ సాంగ్స్ చూస్తున్నాడో తెలుసా!

Sep 17, 2026 5:06PM

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు వచ్చినా, ఇక ముందు ఎన్ని సినిమాలు వచ్చినా 'గబ్బర్ సింగ్' మానియా మాత్రం నిత్యం రగులుతూనే ఉంటుంది. ఈ సినిమాలో 'అంత్యాక్షరి' సన్నివేశంలో నటించి ‘గబ్బర్ సింగ్’ రమేశ్.గా గుర్తింపు పొందాడు రమేశ్.


 కొద్దిరోజుల క్రితం తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై అత్యవసర పరిస్థితిలో అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్న వార్త విని సినీ వర్గాలు, పవన్ కల్యాణ్ అభిమానులు, ప్రేక్షకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.  వైద్యుల నిరంతర పర్యవేక్షణ, శస్త్రచికిత్స మరియు మెరుగైన వైద్య సేవలు ఫలించడంతో రమేశ్ ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్ నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. ఈ కష్టకాలంలో ఆయనలో మానసిక స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు కుటుంబ సభ్యులు ఎంతో శ్రమిస్తున్నారు. ఆసుపత్రి బెడ్‌పైన ఉన్న రమేశ్‌కు ఆయనకు ఎంతో ఇష్టమైన పవన్ కల్యాణ్ సినిమాలను, అలాగే ‘గబ్బర్ సింగ్’ చిత్రంలోని అంత్యాక్షరి సీన్లను టీవీలో చూపిస్తూ నిత్యం ఉత్సాహపరుస్తున్నారు. ఈ క్రమంలో టీవీలో వచ్చే పాటలను చూస్తూ ఆయన సరదాగా పాడుతున్న ఓ భావోద్వేగమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

Also Read: బెడ్‌రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ 'బాల్‌'తోనే.. బోల్డ్ సీన్స్ గుట్టు విప్పిన హీరోయిన్!

 రమేశ్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిన వెంటనే టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు, సహ నటులు, దర్శకులు మరియు మెగా కుటుంబ సభ్యులు తక్షణమే స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి మరియు నాగబాబు రమేష్ కుటుంబానికి 5 లక్షల మేర ఆర్థిక సాయం ప్రకటించడమే కాకుండా లక్షల ఖరీదైన ట్రీట్ మెంట్ ని కూడా అపోలోలో ఫ్రీగా ఇప్పించారు. వీడియో చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ 'రమేష్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, మళ్లీ పూర్వవైభవం సంతరించుకుని వెండితెరపై నవ్వులు పూయించాలని  ‘గెట్ వెల్ సూన్ రమేశ్’ అంటూ కామెంట్స్ తో సోషల్ మీడియాకి కూడా మానవత్వం పీక్ లో ఉంటుందని నిరూపిస్తున్నారు.

 

 

[Gabbari Sing, Pawan kalyan, Gabbar Singh Actor Ramesh Brain Stroke Recovery, Chiranjeevi, Tollywood Movies Postponed, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com