Home

»

Latest News

నైజాం డే-1 టాప్ షేర్ మూవీస్: ప్రభాస్ రేంజ్‌లో నాని మూవీ కలెక్షన్.. ‘ప్యారడైజ్’ ప్లేస్ ఏంటంటే.?

Sep 25, 2026 2:26PM

తెలుగు సినిమాలకు నైజాం మార్కెట్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ ఓపెనింగ్స్ సాధించే సినిమాల్లో నైజాం షేర్ కీలక పాత్ర పోషిస్తుంటుంది.

తాజాగా నైజాం ఏరియాలో డే 1 అత్యధిక షేర్ సాధించిన సినిమాల లిస్ట్ ఆసక్తికరంగా మారింది. ఈ జాబితాలో వరుసగా పాన్ ఇండియా సినిమాలతో పాటు టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ లిస్టులో నాని లేటెస్ట్ మూవీ 'ప్యారడైజ్' చేరడం విశేషం.

ట్రేడ్ లెక్కల ప్రకారం, డే 1 నైజాం టాప్ షేర్ మూవీస్ విషయానికి వస్తే..

పుష్ప 2 – రూ.25.60 కోట్లు
OG – రూ.24.45 కోట్లు
RRR – రూ.23.35 కోట్లు
దేవర – రూ.22.64 కోట్లు
సలార్ – రూ.22.55 కోట్లు
కల్కి 2898 AD – రూ.19.60 కోట్లు
పెద్ది – రూ.18.32 కోట్లు
గుంటూరు కారం – రూ.16.45 కోట్లు
ది రాజాసాబ్ – రూ.15.70 కోట్లు
ది ప్యారడైజ్ – రూ.15.70 కోట్లు

ఈ లిస్ట్‌లో ‘పుష్ప 2’ రూ.25.60 కోట్ల డే 1 షేర్‌తో టాప్‌లో ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ‘OG’, ‘RRR’, ‘దేవర’, ‘సలార్’ సినిమాలు ఉన్నాయి.

ఇక తాజాగా వచ్చిన ‘ది ప్యారడైజ్’ రూ.15.70 కోట్ల షేర్‌తో టాప్ 10లో చోటు సంపాదించినట్లు ఈ లెక్కలు చెబుతున్నాయి. ఏకంగా ప్రభాస్ ‘ది రాజాసాబ్’తో సమానమైన షేర్‌తో పదో స్థానంలో నిలవడం సంచలనంగా మారింది.

అంటే నైజాం మార్కెట్‌లో భారీ క్రేజ్ ఉన్న సినిమాల సరసన ‘ప్యారడైజ్’ కూడా డే 1 కలెక్షన్స్ పరంగా నిలిచిందన్నమాట.

మరి.. ఫస్ట్ డే తర్వాత ‘ప్యారడైజ్’ నైజాంలో ఎలాంటి రన్ కొనసాగిస్తుంది? ఫుల్ రన్‌లో ఈ సినిమా ఎక్కడ నిలుస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి: ‘ప్యారడైజ్’లో మోహన్ బాబు.. ఈ జనరేషన్ డైరెక్టర్స్ ఓ లుక్ వేయాల్సిందే.!

 

 

 

[The Paradise Nizam Day 1 Share, The Paradise Day 1 Collection, Nizam Day 1 Top Share Movies, Nani Paradise Collections, The Paradise Movie, Nani Paradise, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com