Home

»

Latest News

ప్యారడైజ్ ఫలితంపై నాని సంచలన ట్వీట్: ఏం చేస్తారో మీ ఇష్టం!

Sep 25, 2026 2:20PM


నాచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ గురించి చేసిన ట్వీట్ ఇప్పుడు అభిమానులని ఆకర్షించడమే కాకుండా నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ట్వీట్ లో ఏముందో చూద్దాం. 


సినిమా విడుదలైనప్పటి నుంచి వస్తున్న ప్రతీ స్పందనని నేను దగ్గరుండి గమనిస్తున్నాను. ప్యారడైజ్ పై ప్రేక్షకులు చూపించిన అపారమైన ప్రేమని , గుండెల్లో పెట్టుకుని ఆదరించిన తీరును చూసి మైమరిచిపోయాను. అదే సమయంలో సోషల్ మీడియాలో వచ్చిన సరదా ట్రోల్స్‌ను కూడా అంతే సరదాగా ఆస్వాదించాను. అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమాని పూర్తిగా తమ సొంత చిత్రంగా భావించి, ఓన్ చేసుకున్న తీరు నన్ను ఎంతో ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసింది. అలాగే, వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో రివ్యూయర్లు, ఫిల్మ్ క్రిటిక్స్ ఎత్తిచూపిన లోపాలను, విమర్శలను కూడా నేను చాలా సానుకూలంగా స్వీకరించాను. వాటన్నింటి నుంచి ఒక నటుడిగా నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని గ్రహించాను.


ఇది కూడా చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అక్టోబర్ 23 న ముహూర్తం ఫిక్స్!

మీరు అందించిన ఈ అద్భుతమైన అనుభూతికి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పడం తప్ప నేను ఏమీ చేయలేను. 'ది ప్యారడైజ్' చిత్రాన్ని మీ అందరికీ ఒక వినూత్నమైన, మునుపెన్నడూ చూడని డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాలనే ఏకైక లక్ష్యంతో ఎంతో రక్తం, చెమట చిందించి నిర్మించాము. ఇది పూర్తిగా మీ సినిమా.. దీనిని అంగరంగ వైభవంగా వేడుక చేసుకోవడమైనా, లేదా బాధ్యతాయుతంగా విశ్లేషించి తీర్పు చెప్పడమైనా అది పూర్తిగా మీకే వదిలేస్తున్నాను. ఈ సినిమా పట్ల మీరు చూపించిన ఉత్సాహం, నాపై కురిపించిన అమితమైన ఆప్యాయత నన్ను మరింత బాధ్యతాయుతంగా మార్చాయి. నా గుండె నిండా ఎప్పటికీ మాయం కానీ  కృతజ్ఞతా భావం మిగిలిపోయింది అంటూ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ప్యారడైజ్ 88 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టి మరిన్ని కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తుంది.


   

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com