
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల ల 'ది ప్యారడైజ్' కోసం ఎంతలా అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూసారంటే ఎదురుచూడని వాళ్ళు సినీ ప్రేమికులు కాదేమో అనేలా.. దీంతో ప్రీమియర్స్ నుంచే తమ ఆశ నెరవేరే మహా భాగ్యం దక్కడంతో నెల చివర కూడా లెక్కచేయకుండా 500 Rs కాగితాన్ని కూడా లెక్కచేయకుండా థియేటర్స్ ముందు బారులు తీరారు. కానీ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో అభిమానులు, సినీ ప్రేమికులు జీర్ణించుకోలేక పోతున్నారు
ప్యారడైజ్ కి ప్రధానమైన ప్లస్ పాయింట్స్ చూస్తే, నాని నటనా విశ్వరూపం అని చెప్పవచ్చు. తన రెగ్యులర్ ఇమేజ్‌ను పక్కన పెట్టి రా అండ్ రస్టిక్ అవతారంలో జడల్ క్యారక్టర్ లో జీవించాడు. ఫస్టాఫ్ అంతా సీట్ ఎడ్జ్ డ్రామాతో, అదిరిపోయే నాని ఇంట్రడక్షన్, ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్స్, గ్రాండ్ మేకింగ్ విలువలతో ప్రేక్షక దేవుళ్లను కట్టిపడేస్తుంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన నేపధ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసి, రక్తం ఉడికేలా చేసే యాక్షన్ ఎపిసోడ్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. మోహన్ బాబు విలనిజం వింటేజ్ శైలిని గుర్తుచేస్తుండగా, సాయి సిహెచ్ సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అత్యున్నత ప్రమాణాల్లో నిలిచాయి.
ఇది కూడా చదవండి: తస్మాత్ జాగ్రత్త: కంటెంట్ బాగోపోతే.. దుకాణ్ బంద్!
.webp)
అయితే కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో కథనం కొంతవరకు దారితప్పడం, వేగం నెమ్మదించడం ప్రధాన లోపంగా కనిపిస్తుంది. ఇంటర్వెల్ లో ఇచ్చిన భారీ హైని సెకండాఫ్‌లో పూర్తిగా నిలబెట్టలేకపోయారని, అనవసర రాజకీయాన్ని చొప్పించడంతో కథలోని భావోద్వేగం కాస్త దెబ్బతిన్నదని విమర్శలు వస్తున్నాయి. హీరోయిన్ కయాదు లోహర్ ట్రాక్ కూడా కథా గమనానికి అంతగా సహకరించలేదు. అలాగే కొన్ని చోట్ల శబ్ద స్థాయిల వల్ల డైలాగ్స్ సరిగా వినపడకపోవడం ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తుంది.మొత్తానికి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎమోషన్ కంటే యాక్షన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ, మాస్ ఆడియెన్స్‌ను అలరించే అంశాలు, నాని అద్భుత నటన, అనిరుధ్ మ్యూజిక్ థియేటర్లలో మంచి అనుభూతిని అందించే అవకాశాలు ఉన్నాయనే టాక్ మూవీ చూసిన వాళ్ళ దగ్గరనుంచి వినపడుతుంది.
[The Paradise Movie Public Talk, Nani, The Paradise, Srikanth Odela, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]






