
తెలుగు సినిమా స్క్రీన్ పై ఎంతో మంది దేవతలు కనపడి ప్రేక్షకులకి తమ కరుణ కటాక్షాలు అందించారు. ఆ కోవలోనే ఇటీవల విడుదలైన 'ది ప్యారడైజ్' లో ధూమావతి అమ్మవారు కనిపించారు. కానీ ఈ అమ్మవారి గురించి మెజారిటీ ప్రేక్షకులకి తెలియదు. మరి ఈ ధూమావతి అమ్మవారు ఎవరు? పూజా నేపథ్యం. అసలు , భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఆమెకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి
హిందూ ఆధ్యాత్మిక తంత్ర శాస్త్రంలో దశమహావిద్యలు (10 Mahavidyas) చాలా శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి. పార్వతీ దేవికి ఉన్న 10 ఉగ్ర రూపాలలో 7వ మహావిద్యయే ఈ ధూమావతి అమ్మవారు. దేవి ఉగ్రరూపం, ధూమం అంటే పొగ అని అర్థం. కోపంతో పొగలు కక్కుతున్న రూపంలో దర్శనమిచ్చే ఈ దేవిని "విధవా దేవి" అని కూడా పిలుస్తారు. దేవి చేతిలో చేట (ముర్రం), విరిగిన రథం, వాహనంగా కాకి (Crow) ఉంటాయి. సాధారణంగా దేవతలను అత్యంత అలంకారాలతో పూజిస్తే, ధూమావతి అమ్మవారిని మాత్రం తెల్లటి వస్త్రాలతో, ముడతలు పడిన శరీరంతో, వృద్ధురాలి రూపంలో ఆరాధిస్తారు.
ఇది కూడా చదవండి: దేవతలతో పెట్టుకోకండి: దమ్ము ధైర్యం ఉండాలి: 'ది ప్యారడైజ్ 'పై వేణు స్వామి సంచలన కామెంట్స్

పురాణాల ప్రకారం ఒకసారి పార్వతీ దేవికి తీవ్రమైన ఆకలి వేసినప్పుడు, పరమశివుడిని ఆహారం అడుగుతుంది. శివుడు కొద్దిసేపు వేచి ఉండమని చెప్పినప్పటికీ, ఆకలి తట్టుకోలేక పార్వతీ దేవి ఏకంగా శివుడినే మింగేస్తుంది. అయితే పరమశివుడి కంఠంలో ఉన్న హాలాహలం వల్ల దేవి శరీరం నుండి పొగలు రావడం ప్రారంభిస్తాయి. ఆ తరువాత శివుడు దేవి ఉదరం నుండి బయటకు వచ్చి, నీవు నన్ను మింగడం వల్ల వైధవ్యాన్ని పొందావు అని, అందుకే నిన్ను ధూమావతిగా పిలుస్తారని చెప్తాడు.
భారతదేశంలో ధూమాదేవి దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి, కేవలం 1% కంటే తక్కువ క్షేత్రాల్లోనే ఈ దేవి విగ్రహాలు కనిపిస్తాయి. మధ్యప్రదేశ్ లోని దతియా (Datia) పీఠం మరియు వారణాసిలోని ధూమావతి ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందినవి. ఇప్పుడు ఈ విషయాలు వైరల్ గా మారడంతో సినీ ప్రేమికులు స్పందిస్తూ జడల్( నాని) శరీరంలోకి సెకండ్ హాఫ్ లో ధూమావతి అమ్మవారు ప్రవేశించి ఆమె బాడీ లాంగ్వేజ్ తో జడల్ తన జాతికి విముక్తి ప్రసాదించినా బాగుండేదేమో అని అంటున్నారు. ప్రెజెంట్ అయితే ప్యారడైజ్ పరాజయాన్నే తన అస్త్రంగా భావిస్తు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది.
[The Paradise Dhumavati Ammavaru Details, The Paradise Movie Review, Tantric Goddess Dhumavati, Sivudu, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






