
సినిమాలో నటించడమంటే ఎవరకి చేదు చెప్పండి. సినిమా అనేది ఏమి ఇస్తుందో, ఎంత ఇస్తుందో నటులకి, మేకర్స్ కి బాగా తెలుసు. ఇప్పుడు ఆ కోవలో చేరడానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిద్దమయ్యారు.
కొత్తగా రాబోతున్న ఓ కన్నడ చిత్రంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పాత్రలోనే కనిపించబోతున్నారు. ఆర్.ఏ. ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నూతన దర్శకుడు రాజేష్ గౌడ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు తాత్కాలికంగా 'ముఖ్యమంత్రి' అనే శక్తివంతమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. చిత్రం కథాంశం వినగానే సిద్ధరామయ్యకు బాగా నచ్చడంతో, ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సాధారణంగా సినిమాలు పూర్తి కావడానికి నెలల సమయం పడుతుంది, కానీ ఈ చిత్రబృందం ఒక ప్రపంచ రికార్డును లక్ష్యంగా పెట్టుకుంది. స్క్రిప్ట్ రాయడం నుంచి షూటింగ్, ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, చివరకు థియేట్రికల్ స్క్రీనింగ్ వరకు కేవలం 48 గంటల్లోనే పూర్తి చేయాలని మేకర్స్ ప్రణాళిక రచిస్తున్నారు. నవంబర్ నాటికి ఈ భారీ 48 గంటల షూటింగ్ అద్భుతాన్ని పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
.webp)
ఇది కూడా చదవండి: ది ప్యారడైజ్' లోని ధూమావతి అమ్మవారు ఎవరో తెలుసా: ఓరి నాయనో ఇదా హిస్టరీ!
పైగా ఈ వయసులో యాక్టింగ్ కి సిద్దమయ్యారంటే హీరోనే. ఏది ఏమైనా 'మేము నటులమే'.. నీ కంటే చాలా పెద్ద నటులమే' అని సిద్దరామయ్య చాటి చెప్పనున్నారు.
[Siddaramaiah To Act In Kannada Movie, Siddaramaiah Movie, Former Karnataka CM, Siddaramaiah Movie, Kannada Cinema, Mukhyamantri Film, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






