Home

»

Latest News

బాక్సాఫీస్ మ్యాజిక్: నెగెటివ్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురవడానికి వాళ్ళ రివ్యూనే కారణమా!

Sep 28, 2026 4:34PM

 

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద  వింతైన, ఆసక్తికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంతో ఆర్భాటంగా, భారీ అంచనాల నడుమ విడుదలైన 'ది పారడైజ్'కి మొదటి రోజే థియేటర్ల వద్ద   ప్లాప్ టాక్ వచ్చింది. మెజారిటీ రివ్యూస్ ది కూడా అదే పరిస్థితి. మరి సాధారణంగా ఏ సినిమాకైనా మొదటి రోజే ఫ్లాప్ టాక్ వస్తే రెండవ రోజు నుంచే థియేటర్లు ఖాళీ అవ్వడం, కలెక్షన్స్ దారుణంగా పేలవంగా పడిపోవడం మనం చూస్తుంటాం. కానీ 'ది పారడైజ్' విషయంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.

 టాక్ నెగెటివ్‌గా ఉన్నప్పటికీ, కలెక్షన్ల వర్షం మాత్రం తగ్గడం లేదు. తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా  88 కోట్ల గ్రాస్ సాధించి వీకెండ్ ముగిసేసరికి అంటే నిన్నటితో 155 కోట్ల గ్రాస్ రాబట్టింది( ప్రీమియర్స్ తో కలుపుకొని)ఈ విచిత్రమైన వసూళ్ల వెనుక అసలు రహస్యం ఏమిటి అని విశ్లేషిస్తే, ప్రధానంగా కొన్ని ముఖ్యమైన అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. మొదటిది, సినిమాలో వినియోగించిన అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ (VFX) మరియు గ్రాఫిక్స్. పెద్ద తెరపై ఈ విజువల్స్ ఇచ్చే అద్భుతమైన అనుభూతిని ప్రేక్షకులు ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. నెగెటివ్ టాక్ ఉన్నప్పటికీ, "ఒక్కసారి థియేటర్‌లో చూసి ఆ విజువల్ గ్రాండ్‌నెస్ అనుభవించాలి" అనే ఉత్సుకత సాధారణ ప్రేక్షకులలో బలంగా పెరిగింది. రెండవది, కథనంలో లోపాలు ఉన్నప్పటికీ, మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న భారీ యాక్షన్ సీక్వెన్సెస్. ముఖ్యంగా ప్రీ-ఇంటర్వెల్ వద్ద వచ్చే 15 నిమిషాల యాక్షన్ బ్లాక్ మరియు సెకండ్ హాఫ్‌లో వచ్చే క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో ఈలలు వేయిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: వాళ్ల ఎంజాయ్‌మెంట్ కోసం పెళ్లి చేసుకోవాలా: ఆ రోజు ఏం చేస్తారో తెలుసా!

 

 

మరొక ప్రధాన కారణం, నాని  స్టార్ డమ్ ఫ్యాన్ బేస్. కేవలం అభిమానులే దాదాపు 40 శాతం ఆక్యుపెన్సీని మొదటి మూడు రోజులు నిలబెట్టేలా థియేటర్లకు పోటెత్తారు. అంతేకాకుండా, ఈ మధ్య కాలంలో థియేటర్లలో సరైన పెద్ద మాస్ ఎంటర్‌టైనర్ సినిమాలు లేకపోవడం కూడా ఈ చిత్రానికి ప్లస్ పాయింట్‌గా మారింది. మల్టీప్లెక్స్‌లలో ఆక్యుపెన్సీ రేటు దాదాపు 75 శాతంగా నమోదు కాగా, సింగిల్ స్క్రీన్స్ వద్ద 85 శాతానికి పైగా బుకింగ్స్ నమోదవుతున్నాయి. సోషల్ మీడియాలో నెగెటివ్ రివ్యూస్ వస్తున్నప్పటికీ, యూత్ మరియు మాస్ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాను ఓసారి చూడాల్సిందేనని ఫిక్స్ అయిపోతున్నారు. మొత్తానికి టాక్ నెగెటివ్‌గా ఉన్నా బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తూ 'ది పారడైజ్' ఒక కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తోంది. ఏది ఏమైనా మా తెలుగు వన్ ఛానల్ లో  నాని అభిమానులు, మాస్ ప్రేక్షకులకి  నచ్చవచ్చేమో అని చెప్పిన రివ్యూ అక్షర సత్యం అని రుజువయ్యింది.

 

[The Paradise Collections, The Paradise movie box office collections, The Paradise Review, Nani, kayadu Lohar, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com