
అంజలి.. అచ్చ తెలుగు నటి. కానీ రెండు దశాబ్దాల క్రితమే తమిళ, మలయాళ భాషల్లో అనేక చిత్రాలు చేసి తన సత్తా చాటింది. రీసెంట్ గా విశాల్ తో కలిసి మగుడం(తమిళ్), మకుటం (తెలుగు) సందడి చేసి రేపు అక్టోబర్ 1 న నివిన్ పౌలీ, సూరి తో కలిసి 'సంచారి' తో తెలుగు సెల్యులాయిడ్ పై మరో సారి మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతుంది.
తాజాగా ఓ ప్రముఖ ఇంటర్వ్యూలో తన వివాహంపై వస్తున్న రకరకాల రూమర్లపై అంజలి స్పందిస్తూ అత్యంత చమత్కారంగా, సూటిగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే ఆలోచన ఏమాత్రం లేదని, ఈ విషయంలో ఎలాంటి తొందరపడాల్సిన అవసరం కూడా లేదని ఆమె స్పష్టం చేశారు. "పెళ్లి అనేది పూర్తిగా నా వ్యక్తిగత విషయం, అది నా జీవితం. నా మనసుకు ఎప్పుడు సరైన సమయం అనిపిస్తుందో అప్పుడే ఆ నిర్ణయం తీసుకుంటాను. అసలు నా పెళ్లి గురించి అందరికీ అంత ఆత్రుత, తొందర ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇక తన పెళ్లి వేడుకల చుట్టూ తన స్నేహితులు చేసే హడావుడిని గుర్తుచేసుకుంటూ అంజలి నవ్వులు పూయించారు. "నా పెళ్లి గురించి నాకంటే నా ఫ్రెండ్స్‌కే ఎక్కువ ఆసక్తి, ఆత్రుత ఉంది.
.webp)
ఇది కూడా చదవండి: బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్: వాళ్ళు అదృష్టవంతులే!
పెళ్లికూతురి కంటే వాళ్లకే ఈ వేడుకలంటే అమితమైన క్రేజ్. కొత్త బట్టలు వేసుకోవడం, ఫొటోషూట్‌లు తీయించుకోవడం, రోజంతా సందడి చేస్తూ ఎంజాయ్ చేయడం వాళ్లకు కావాలి. వాళ్ల సరదాల కోసం, వాళ్లు ఎంజాయ్ చేయడానికి నేను వేరొకరిని పెళ్లి చేసుకోవడం ఏంటి?" అని సరదాగా వ్యాఖ్యానించారు.
[Actress Anjali Shuts Down Wedding Rumours, Actress Anjali Marriage Rumours, Anjali, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]





.webp)
