Home

»

Latest News

విజ‌య్‌, సంగీత క‌లిసిపోయార‌నేది నిజమేనా?.. బ‌ర్త్‌డేకి ఫ్యాన్స్‌ని స‌ర్‌ప్రైజ్ చేస్తారా?

Jun 13, 2026 2:23PM

సౌత్ సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లో గత కొన్ని నెలలుగా తీవ్ర సంచలనం సృష్టించిన కోలీవుడ్ స్టార్ హీరో, రాజకీయ సంచలనం దళపతి విజయ్ విడాకుల వ్యవహారానికి ఎట్టకేలకు శుభం కార్డు పడినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్న విజయ్, ఆయన సతీమణి సంగీత సోమలింగం తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి మళ్లీ ఒక్కటయ్యారనే వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది. లండన్ నుంచి సంగీత తిరిగి చెన్నైకి చేరుకోవడంతో ఈ మెగా రియూనియన్ సాధ్యమైందని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి.

గతంలో విజయ్ నటించిన చిత్రాల ఆడియో వేడుకలు, సక్సెస్ మీట్లు, పబ్లిక్ ఈవెంట్లు జరిగితే సంగీత తప్పకుండా హాజరయ్యేవారు. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో ఆమె చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేయడం, విజయ్ రాజకీయ ప్రచార కార్యక్రమాలకు అలాగే ప్రమాణ స్వీకారానికి కూడా దూరంగా ఉండటంతో వీరి బంధం తెగిపోయిందనే ఊహాగానాలు గట్టిగా వినిపించాయి. విజయ్ తనను పట్టించుకోకుండా ఒక స్టార్ నటితో సన్నిహితంగా ఉంటున్నారని, అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.  

అయితే విజయ్ రాజకీయ భవిష్యత్తును, అలాగే కుటుంబ బంధాల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని విజయ్ తల్లి శోభ చంద్రశేఖర్‌తో పాటు కుటుంబంలోని ఇతర పెద్దలు కలిసి వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు గట్టిగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొడుకు కెరీర్ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో తల్లి శోభ స్వయంగా కోడలితో మాట్లాడి, ఇరు పక్షాల మధ్య ఉన్న మనస్పర్థలను సక్సెస్ ఫుల్‌గా సెటిల్ చేసినట్లు సమాచారం. తల్లి చేసిన సుదీర్ఘ చర్చలు ఎట్టకేలకు సానుకూల ఫలితాలనిచ్చాయి.  

ఈ రాయబారం ఫలించడంతో సంగీత విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, మళ్లీ విజయ్‌తో కలిసి ఒకే ఇంట్లో ఉండటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెన్నై టాక్. ఇప్పటికే లండన్ నుండి చెన్నై తిరిగి వచ్చిన ఆమె.. ప్రస్తుతం విజయ్‌తో కలిసి సమయం గడుపుతున్నారని సమాచారం. ఈ పరిణామం పొలిటికల్‌గా మరియు పర్సనల్‌గా విజయ్‌కు ఎంతో ప్లస్ కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే తండ్రి సపోర్ట్ ఎంతో అవసరమైన వారి కుమారుడు జేసన్ సంజయ్ భవిష్యత్తుకు కూడా ఇది మంచి పరిణామం.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రియూనియన్ వార్త విపరీతంగా వైరల్ అవుతుండటంతో దళపతి అభిమానులు ఆనంద డోలికల్లో తేలుతున్నారు. ఎంతైనా టాలీవుడ్, కోలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట మళ్లీ కలవడం సంతోషకరమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్యాచ్‌అప్‌పై ఈ దంపతుల నుంచి ఒక అఫీషియల్ అప్‌డేట్ లేదా ఇద్దరూ కలిసి ఉన్న ఒక క్రేజీ పిక్ బయటకు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com